- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూలై 1 నుంచి కొత్త రూల్స్, కొత్త ధరలు ఇవే !
ఇవాళ జూలై ఒకటో తేదీ. ఒకటో తేదీ రాగానే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఏటీఎం కార్డు చార్జీలు ( ATM card charges), విమానా

దిశ, వెబ్ డెస్క్ : ఇవాళ జూలై ఒకటో తేదీ. ఒకటో తేదీ రాగానే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఏటీఎం కార్డు చార్జీలు ( ATM card charges), విమానా అలాగే రైల్వే టికెట్ల ధరలు, గ్యాస్ సిలిండర్, మొబైల్ రీఛార్జిల ధరలలో భారీ మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ జులై ఒకటవ తేదీ నుంచి కూడా కొన్ని నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఈ ఒకటో తేదీ నుంచి పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట లభించింది.
ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలకు చివరి తేదీని జూలై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. దీనివల్ల ఉద్యోగులకు తమ రిటర్న్ లను ఫైల్ చేయడానికి అదనంగా 46 రోజులు లభించబోతుంది. ఇక ఈ ఒకటో తేదీ నుంచి కొత్త పాన్ కార్డు దరఖాస్తుకు అలాగే తాత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆదాయపు పన్ను రిటర్న్ ల దాఖలు, క్రెడిట్ కార్డ్, ఇలాంటి వాటికోసం కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు.
ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా సర్వీస్ చార్జీలను సవరించనున్నారు. ఈ మార్పులు ఏటీఎం లావాదేవీలు అలాగే ఆన్లైన్ బదిలీలను ప్రభావితం చేస్తాయి. హెచ్ డి ఎఫ్ సి ( HDFC Bank)బ్యాంకు కొన్ని లావాదేవీలపై చార్జీలను సవరించనుంది. ఈ ధరలు జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.






