- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Whatsapp update: ఒకే యాప్ రెండు అకౌంట్లు, అచ్చం ఇన్ స్టా లాంటి లుక్.. వాట్సాప్ కొత్త అప్డేట్స్ చూశారా?
ప్రపంచవ్యాప్తంగా ఎక్కవ మంది వినియోగిస్తున్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (whatsapp). సోషల్ మీడియా వచ్చిన తరవాత వాట్సాప్ ఓ సంచలనం అనే చెప్పాలి. ఆండ్రాయిడ్, ఐఫోన్ ఏదైనా ఈ యాప్ కచ్చితంగా ఉండాల్సిందే. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చాటింగ్, వీడియో కాల్స్, ఫైల్స్ షేరింగ్ ఇలా అనేక పనుల కోసం వాట్సాప్ వినియోగిస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కవ మంది వినియోగిస్తున్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (whatsapp). సోషల్ మీడియా వచ్చిన తరవాత వాట్సాప్ ఓ సంచలనం అనే చెప్పాలి. ఆండ్రాయిడ్, ఐఫోన్ ఏదైనా ఈ యాప్ కచ్చితంగా ఉండాల్సిందే. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చాటింగ్, వీడియో కాల్స్, ఫైల్స్ షేరింగ్ ఇలా అనేక పనుల కోసం వాట్సాప్ వినియోగిస్తుంటారు. దీంతో ఎప్పటికప్పుడు యూజర్లకు సేవలు అందించేందుకు వాట్సాప్ మాతృసంస్థ మెటా సరికొత్త అప్డేట్స్ తీసుకువస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో వాట్సాప్ లో కొన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. ఇది వరకు యాప్‌లో మన ప్రొఫైల్ చూడాలంటే కుడిపక్కన మూడు డాట్స్ పై క్లిక్ చేసి చూడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు కుడి భాగంలో పైన కనిపిస్తుంది. అంతే కాకుండా ప్రొఫైల్ పై క్లిక్ చేసిన తరవాత ఇన్ స్టా (instagram) మాదిరిగా వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని అడుగుతుంది. అందులో చాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాను, ఉత్సాహంగా ఉన్నాను లాంటి టెక్స్ట్ కనిపిస్తుంది. దీంతో పాటు మీరు సొంతంగా కూడా మనసులో ఉంది రాసుకోచ్చు.
అలా రాసింది గంట ఉండాలా ఒక రోజు ఉండాలా, వారం ఉండాలా అని కూడా మనం సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది వరకు ఇదే ఆప్షన్ ఎబౌట్ అని ఉండేది. అందులో బిజీ, ఓన్లీ కాల్స్ లాంటి ఆప్షన్స్ ఉండేవి. ఇక దీంతో పాటు ఇప్పుడు ఒకే వాట్సాప్ లో రెండు ఫోన్ నంబర్స్ తో రెండు అకౌంట్స్ లాగిన్ అవ్వచ్చు. ఇన్ స్టాలో ఏ విధంగా అయితే లాగిన్ టూ అదర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉందే ఇందులో కూడా అచ్చం అలాంటి ఫీచర్ నే తీసుకువచ్చారు. రెండు వాట్సాప్‌లు వాడాలి అనుకుంటున్నవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.






