- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon grate indian festival sale: 42వేల ఫోన్ కేవలం 20వేలకే.. దీనిని కొనవచ్చా?
దసరా, దీపావళి నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో పలు మొబైల్ ఫోన్స్‌పై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే Xiaomi 14 Civi ఫోన్ ధర భారీగా తగ్గించారు.

దిశ, వెబ్ డెస్క్: దసరా, దీపావళి నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో పలు మొబైల్ ఫోన్స్‌పై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే Xiaomi 14 Civi ఫోన్ ధర భారీగా తగ్గించారు. ఈ మొబైల్ లాంచింగ్ ధర రూ.42,999 కాగా ప్రస్తుతం రూ.16,500 తగ్గించారు. దీంతో ఫోన్ ధర రూ. 27,499గా ఉంది. క్రెడిట్ కార్టులపై మరో 1200 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే దాదాపు రూ.25,000లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్ అత్యుత్తమ డిస్ ప్లే, బహుముఖ కెమెరాలు టెక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫోన్ డిజైన్ సైతం ఆకర్షణీయంగా ఉండటంతో చాలా మంది ఈ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకున్నారు. అయితే అప్పుడు ధర రూ.42వేలు ఉంటే ఇప్పుడు కేవలం రూ.25,000లకు వస్తోంది. కాగా ఇదే ఫోన్ అమెజాన్ లో రూ.39,000 ఉంది.
ఈ మొబైల్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 8GB ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమోరీ ఉన్నాయి. అంతే కాకుండా 6.55 ఇంచుల డిస్ ప్లే ఉంది. వీటితో పాటు 50 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 32MP + 32MP Dual Front Camera ఉన్నాయి. కాబట్టి సెల్ఫీల కోసం ఈ ఫోన్ బెస్ట్ అనే చెప్పాలి. అదే విధంగా ఇందులో 4700 mAh Battery ఉంది. అంతే కాకుండా 8s Gen 3 Mobile Platform Processor ఇందులో ఉంది. మంచి ఫీచర్స్ తో పాటు ధర చాలా వరకు తగ్గడంతో 20వేల బడ్జెట్ లో ఫోన్ తీసుకోవాలి అనుకునేవాళ్లు దీనిని కొనుగోలు చేయవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.






