- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI Doctor: ప్రపంచంలోనే తొలి AI ఆస్పత్రి.. రోబోలే డాక్టర్లు, నర్సులు.. ఇంతకీ ఎక్కడంటే?
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుపు వేగంత అభివృద్ధి చెందుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) మెరుపు వేగంత అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ.. తాజాగా వైద్య రంగంలో (Medical field) అద్భుతాలను సృష్టించబోతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆస్పత్రిని (The first AI hospital) సౌదీ అరేబియాలో (Saudi Arabia) ప్రారంభించారు. చైనాలోని (China) మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనీ ఏఐ, సౌదీ ఆరోగ్య సంస్థ అల్మూసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ఆస్పత్రిలో డాక్టర్‌గా హుహ (Dr Hua) అనే ఏఐ ఆధారిత వైద్యుడు, నర్సులుగా ఏఐ రోబోలు సేవలందిస్తాయి. ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇక ఈ ఆస్పత్రిలో ఉబ్బసం, గొంతునొప్పి వంటి 30 రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు.
ఏఐ క్లినిక్ ఎలా పనిచేస్తుంది?
ఈ క్లినిక్‌కు వచ్చిన రోగులు తమ లక్షణాలను ట్యాబ్లెట్ ద్వారా వివరిస్తారు. తిరిగి రోగులను మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. అనంతరం వాటిని విశ్లేషించి చికిత్స సూచనలు అందిస్తుంది. ఈ విధానం రోగులకు వేగవంతమైన, కచ్చితమైన వైద్య సేవలను అందించడంలో సహాయపడుతుంది. ఇక ఏఐ కూడా పరిష్కరించలేని అత్యవసర కేసులను చూసేందుకు నిజమైన వైద్యులు కూడా ఈ క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు. ఇది భవిష్యత్తులో వైద్య సేవల అందుబాటును పెంచడంలో, వైద్యులపై భారం తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషించనుంది.
ప్రస్తుతం పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ క్లినిక్ ప్రారంభమైంది. దీని డేటా ఆధారంగా రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ల సేవలు విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రయల్‌కు ముందు నిర్వహించిన పరీక్షా దశలో, ఈ సాంకేతికతలో తప్పుల శాతం కేవలం 0.3 శాతంగా ఉందని సిన్యి ఏఐ పేర్కొంది.






