‘Redmi A2’ సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇదే ఆ తేదీ!

by Disha Web Desk 17 |
‘Redmi A2’ సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇదే ఆ తేదీ!
X

దిశ, వెబ్‌డెస్క్: Redmi కంపెనీ నుంచి ‘Redmi A2’ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లోకి రానున్నాయి. ట్విట్టర్‌లో రెడ్‌మి ఇండియా ట్వీట్ చేసిన దాని ప్రకారం, A2 సిరీస్ మే 19న ఇండియాలోకి అడుగుపెట్టనుంది. ప్రధానంగా Redmi A2, Redmi A2+లు ఎంట్రీ-లెవల్ ఆఫర్‌లుగా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. Redmi A2 ఫోన్ 720 x 1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.52-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Helio G36 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Android 12 (Go Edition)తో రన్ అవుతుంది. ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ప్రైమరీ, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.








Next Story