బడ్జెట్ ధరలో ఫోన్ కావాలనుకుంటున్నారా..? అయితే ఈ ఫోన్‌ను ఒక లుక్ వేయండి

by Harish |

టెక్నో కంపెనీ భారత్‌లో కొత్తగా స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మోడల్ పేరు ‘టెక్నో స్పార్క్ 10 5G’. దీని ధర రూ. 12,999 వరకు ఉండనుంది.

బడ్జెట్ ధరలో ఫోన్ కావాలనుకుంటున్నారా..? అయితే ఈ ఫోన్‌ను ఒక లుక్ వేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నో కంపెనీ భారత్‌లో కొత్తగా స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మోడల్ పేరు ‘టెక్నో స్పార్క్ 10 5G’. దీని ధర రూ. 12,999 వరకు ఉండనుంది.ఫోన్ మెటా బ్లాక్, మెటా వైట్ కలర్స్‌లో ఏప్రిల్ 7 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Android v13 తో రన్ అవుతుంది. MediaTek Dimensity 6020 చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది. 4GB RAM‌తో 64GB మెమరీని కలిగి ఉంది. ఈ మెమరీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.


కెమెరా విషయాలకు వస్తే ఫోన్ బ్యాక్ సైడ్ ప్రధానంగా 50MP కెమెరా ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 8MP కెమెరాను అందించారు. స్మార్ట్‌ఫోన్‌లో 18W చార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని అమర్చారు. దీంతో 50 నిమిషాల్లో బ్యాటరీని 50% వరకు చార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

Next Story