- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్నో నుంచి రెండు 5G ఫోన్స్.. ఏకంగా 6000 బ్యాటరీతో లాంచ్!
మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో 5జి మొబైల్ తప్ప మిగతా ఫోన్లు ఎవరు వాడడం

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో 5జి మొబైల్ తప్ప మిగతా ఫోన్లు ఎవరు వాడడం లేదు. ఈ నేపథ్యంలోనే 5జి మొబైల్స్ కూడా... విపరీతంగా మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఇక తాజాగా చైనాకు చెందిన టెక్నో సంస్థ రెండు సరికొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ రెండు మొబైల్స్ కూడా 5జి మోడల్స్ కావడం విశేషం.
టెక్నో పోవా 7 5g (Tecno Pova 7 5G), టెక్నో పోవా 7 ప్రో 5g (Tecno Pova 7 Pro 5G)మోడల్స్ రిలీజ్ చేసింది కంపెనీ. విభిన్న డిజైన్స్ తో బడ్జెట్ ధరలో ఈ మొబైల్ ఫోన్ లను తీసుకువచ్చింది చైనాకు చెందిన టెక్నో కంపెనీ. టెక్నో పోవా 7 5g మొబైల్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. 8 జిబి+ 128 జీబీ మోడల్ మొబైల్ ధర 13వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో 8 జి బి + 256 జిబి మోడల్ ధర 14 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ మొబైల్ గ్రీన్ బ్లాక్, మ్యాజిక్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్ కలర్స్ లో మనకు లభిస్తుంది. బ్యాటరీ 6000 mah కావడం విశేషం.
టెక్నో పోవా 7 ప్రో 5g మొబైల్ ఫోన్ కూడా రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. 8 జిబి+ 128 జీబీ మోడల్ మొబైల్ ధర 17వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో 8 జి బి + 256 జిబి మోడల్ ధర 18 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా 6000 mah గా ఫిక్స్ చేశారు. ఈ మొబైల్స్ జూలై 10వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటాయి.






