starlink: మస్క్‌కు చైనా నుంచి గట్టి పోటీ.. ఇండియాలో స్టార్‌లింక్‌తో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు ఇవే!

by Vennela |

Starlink: స్టార్‌లింక్ భారత్ లో తన ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.

starlink: మస్క్‌కు చైనా నుంచి గట్టి పోటీ.. ఇండియాలో స్టార్‌లింక్‌తో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: Starlink: స్టార్‌లింక్ భారత్ లో తన ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. త్వరలో ఎలోన్ మస్క్ కంపెనీకి ప్రభుత్వం నుండి నియంత్రణ ఆమోదం లభించే అవకాశం ఉంది. స్టార్‌లింక్ ఇటీవలే భారతదేశంలో తన పరికరాలను విక్రయించడానికి జియో.. ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంతో పాటు, స్టార్‌లింక్ అనేక ఇతర దేశాలలో తన ఉనికిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం, స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రపంచంలోని 125 దేశాలకు చేరుకున్నాయి. దీనికి 7 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

అయితే స్టార్‌లింక్ రాబోయే కాలంలో చైనీస్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు యూటెల్‌సాట్.. స్పేస్‌సెయిల్ నుండి గట్టి పోటీని ఎదుర్కోవల్సి వస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ చైనా కంపెనీలు ప్రస్తుతం బ్రెజిల్, మలేషియా, కజకిస్తాన్‌లలోకి తమ సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ లక్ష్యంగా ప్రతి సంవత్సరం కనీసం 1 మిలియన్ కొత్త వినియోగదారులను చేర్చుకుంటున్నాయి. భారత్ లో స్టార్ లింక్ ప్రారంభమైన తర్వాత కంపెనీ ఈ లక్ష్యాన్ని చేధించవచ్చు. అయితే చైనాకు చెందిన కంపెనీలు భారత్ లో కూడా తమ సర్వీసులను ప్రారంభించేందుకు వేచి చూస్తున్నాయి. ఒకవేళ స్టార్ లింక్ తోపాటు భారత్ ఈ చైనీస్ కంపెనీలకు కూడా అనుమతి ఇచ్చినట్లయితే స్టార్‌లింక్‌కు చైనా కంపెనీలు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే భారత్ లో స్టార్ లింక్ ఎయిర్ టెల్, జియో నుంచి శాటిలైడ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ కోసం పోటీ ఎదుర్కొక తప్పదు. అలాగే అమెజాన్ కొరియర్, బీఎస్ఎన్ శాటిలైట్ సర్వీస్ నుంచి కూడా పోటీ ఉండే అవకాశం ఉంది. టెలికాం నియంత్రణ సంస్థ త్వరలోనే ఉపగ్రహ సేవలకు స్పెక్ట్రమ్ ను కేటాయించనుంది. దీనికోసం వాటాదారులు, నిపుణుల నుంచి అభిప్రాయాన్ని తీసుకునే పని దాదాపు పూర్తయ్యింది.

స్టార్‌లింక్ తన స్పేస్‌ఎక్స్ ఉపగ్రహాల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. భూమి దిగువ కక్ష్యలోని ఉపగ్రహాల ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవను పొందవచ్చు. స్టార్‌లింక్ 2022 నుండి భారతదేశంలో తన సర్వీను ప్రారంభించేందుకు వేచి చూస్తోంది. భారత ప్రభుత్వం నుండి నియంత్రణ ఆమోదం , స్పెక్ట్రమ్ కేటాయింపులు పొందిన తర్వాత స్టార్‌లింక్ భారతదేశంలో తన సేవను ప్రారంభిస్తుంది. ఎయిర్‌టెల్, జియోతో భాగస్వామ్యం తర్వాత, స్టార్‌లింక్ త్వరలో భారతదేశంలో నియంత్రణ ఆమోదం పొందే అవకాశం ఉంది.

Next Story