- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతి త్వరలో ఇండియాలోకి మస్క్ "స్టార్ లింక్" ఇంటర్నెట్ సేవలు..ప్లాన్ ధర, ఇతర వివరాలు ఇవే
ఎలాన్ మస్క్ ఇండియాలో టెలికమ్యూనికేషన్ రంగంలో అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు చెందిన స్టార్ లింక్‌కు ఇండియాలో టెలికమ్యూనికేషన్ విభాగం ఆమోదం లభించింది. దీంతో ఇండియాలో స్టార్ లింక్ లాంఛింగ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఎలాన్ మస్క్ ఇండియాలో టెలికమ్యూనికేషన్ రంగంలో అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు చెందిన స్టార్ లింక్‌కు ఇండియాలో టెలికమ్యూనికేషన్ విభాగం ఆమోదం లభించింది. దీంతో ఇండియాలో స్టార్ లింక్ లాంఛింగ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇప్పటికే భారత్‌లోని పది ప్రాంతాల్లో స్టార్ లింక్ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా కార్యాలయాలను కూడా నిర్మించుకున్నట్టు సమాచారం. ముంబై కేంద్రంగా స్టార్ లింక్ కార్యకలాపాలు కొనసాగించబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. పలు కథనాల ప్రకారం ప్యాకేజీ బట్టి స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్ 25Mbps నుండి 220Mbps మధ్య ఉండబోతుందని తెలుస్తోంది. ప్రారంభంలో స్టార్ లింక్ తన సేవలను 2 మిలియన్ కనెక్షన్స్ కు మాత్రమే పరిమితం చేసింది. ఆ తరవాత డిమాండ్ బట్టి సేవలను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని మారుమూల గ్రామాలలోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలని స్టార్ లింక్ భావిస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకున్నట్లయితే ఈ ఏడాది డిసెంబర్ 15న లేదా జనవరి 10, 2026 నుండి స్టార్ లింక్ సేవలు ఇండియాలో ప్రారంభించే ఆలోచనలో మస్క్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా స్టార్ లింక్ ద్వారా డిష్ కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నారట. స్టార్ లింక్ నెలవారి ప్లాన్ ధర రూ.3,300 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇండియాలో జియో, ఎయిర్ టెల్ డిష్ తో పాటు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. స్టార్ లింక్ వాటికి ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.






