ప్రతీనెలా డబ్బులు వదిలించుకోవాల్సిన పని లేదు. రూ.10తో ఏడాది పాటు కాల్స్‌ ఎంజాయ్‌ చేయవచ్చు

by Vennela |

SIM active for JUST Rs 10 a year: కేంద్ర ప్రభుత్వంలోని మోదీ సర్కార్(Pm modi) కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ సర్వీసు(Mobile service)ల్లో పారదర్శకత పెంచేందుకు యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రతీనెలా డబ్బులు వదిలించుకోవాల్సిన పని లేదు. రూ.10తో ఏడాది పాటు కాల్స్‌ ఎంజాయ్‌ చేయవచ్చు
X

దిశ,వెబ్‌డెస్క్: SIM active for JUST Rs 10 a year: కేంద్ర ప్రభుత్వంలోని మోదీ సర్కార్(Pm modi) కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ సర్వీసు(Mobile service)ల్లో పారదర్శకత పెంచేందుకు యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటికీ 2 జీ సేవలను ఉపయోగిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. సుమారు 150 మిలియన్ల మంది ఇప్పటికీ 2జీ(2g) సర్వీసులను ఉపయోగిస్తున్నారు. అయితే 2జీ ఉపయోగించేవారికి ఇంటర్నెట్ అవసరం లేకపోయినా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ట్రాయ్(TRAI) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ట్రాయ్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా ఫీచర్ ఫోన్ యూజర్ల(Feature phone users)కు,వృద్ధులకు, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్స్ ను ఉపయోగించేవారికి ఉపయోగంగా ఉండనున్నాయి. ట్రాయ్ యూజర్ల సేఫ్టీ రూల్స్ (TRAI User Safety Rules)12వ సవరణ కింద 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇంటర్నెట్ అవసరం లేకున్నా కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ కోసం ఫోన్లను ఉపయోగిస్తున్నవారికి ప్రత్యేక టారిఫ్ లను ప్రకటించింది. ఇది వృద్ధులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రత్యేక టారిఫ్ ప్లాన్స్ వ్యాలిడిటీ(Tariff Plans Validity) ఇప్పటి వరకు 90 రోజులు ఉండగా ట్రాయ్ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఈ వ్యవధి ఏడాది వరకు పొడిగించారు. దీంతో యూజర్లకు రీఛార్జ్ సమస్య ఉండదు.

టాప్ అప్ వోచర్స్(Top up vouchers) విషయంలో ట్రాయ్ కీలక మార్పు తీసుకువచ్చింది. ఇప్పుడు కేవలం రూ. 10వోచర్ తో యూజర్లకు తమకు అవసరమైన సర్వీసులను పొందవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం పెరిగిన ఆన్ లైన్ వ్రుద్ధిని ద్రుష్టిలో ఉంచుకుని ట్రాయ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్ ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో యూజర్లు రీఛార్జ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం అవుతుంది.

ఇక రీఛార్జ్ వోచర్స్ కు ముందు కలర్ కోడింగ్ విధానం అందుబాటులో ఉంది. అయితే కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం ఈ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రాయ్ ఈ కొత్త మార్గదర్శకాలను డిసెంబర్ 24, 2024న ప్రకటించింది. అయితే ట్రాయ్ ప్రకటించిన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. అయితే టెలికాం కంపెనీలు ఈ మార్పులు అమలు చేసేందుకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల చివరికి ఈ రీచార్జ్స్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంది.


Next Story