- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
shubamshu shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్రకు ముహూర్తం ఫిక్స్..ఎప్పుడంటే?
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా బృందం జూన్ 19న రోదసి యాత్రకు బయలుదేరుతున్నట్టు ఇస్రో ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా బృందం జూన్ 19న రోదసి యాత్రకు బయలుదేరుతున్నట్టు ఇస్రో ప్రకటించింది. నిజానికి ఈ ప్రయోగం మే 29న చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. కాగా జూన్ 19 చేపడుతున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగంలో శుభాంశుతో పాటూ మరో ముగ్గురు ఆస్ట్రోనాట్ లు రోదసియాత్రకు వెళుతున్నారు.
కాగా ఈ బృందానికి శుభాంశు మిషన్ పైలెట్ బాధ్యతలు నిర్వహిస్తారు. 14 రోజుల పాటు వీరు అంతరిక్షంలోనే ఉండనున్నారు. ఈ ప్రయోగాన్ని అమెరికా వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. అంతే కాకుండా ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. భూమి నుండి బయలుదేరిన తరవాత ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్‌తో అనుసంధానం అవుతుంది.






