- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్ దిగ్గజం యాపిల్‌కు ఎదురుదెబ్బ.. LGI డిజైనర్ అలన్ డై రాజీనామా
ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం యాపిల్ (Apple) ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం యాపిల్ (Apple) ఊహించని షాక్ తగిలింది. లిక్విడ్ గ్లాస్ ఇంటర్‌ఫేస్ డిజైనర్ (Liquid Glass Interface Designer)గా మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న అలన్ డై (Allan Dye) తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన స్థానంలో స్టీఫెన్ లెమే (Stephen Lemay) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఐఫోన్, ఆపిల్ వాచ్, ఐప్యాడ్ వంటి ఉత్పత్తుల డిజైన్‌లో కీలక పాత్ర పోషించిన అలన్ డై, ఆపిల్ హ్యూమన్ ఇంటర్‌ఫేస్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జోనీ ఐవ్‌తో కలిసి ఆపిల్ ఉత్పత్తులకు యూనిక్ ఫీచర్స్, ఇంటర్‌ఫేస్‌లు రూపొందించిన ఘనత అలన్ డైకి ఉంది.
కాగా, అలన్ డై త్వరలోనే ఆయన మెటాలో చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా చేరబోతున్నట్లుగా సమాచారం. మెటా రియాలిటీ ల్యాబ్స్ (Reality Labs) విభాగం, జనరేటివ్ AI ఉత్పత్తుల డిజైన్‌లో అలన్ డై కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఆపిల్ నుంచి మరో సీనియర్ డిజైనర్ మెటాలో చేరడం ఇది రెండోసారి. గతంలో ఆపిల్ హార్డ్‌వేర్ డిజైన్ మాజీ డైరెక్టర్ డంకన్ హోనెట్ (Duncan Honneth) కూడా మెటాలో చేరిన విషయం తెలిసిందే. కాగా, తాజా పరిణామంతో ఆపిల్ డిజైన్ బృందంలో మరింత మార్పులకు దారి తీసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






