WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు శుభ‌వార్త‌.. అందుబాటులోకి మ‌రో ఫీచర్‌

by velandi.Saikiran |

వాట్సాప్ లో షెడ్యూల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. టీమ్స్, గూగుల్ మీట్ తరహాలో ఈ షెడ్యూల్ కాల్ ఫీచర్ ను తాజాగా వాట్సాప్

WhatsApp:  వాట్సాప్‌ యూజర్లకు శుభ‌వార్త‌.. అందుబాటులోకి మ‌రో ఫీచర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: వాట్సాప్ ( WhatsApp) వినియోగదారులకు బిగ్ అలర్ట్. వాట్సాప్ లో షెడ్యూల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. టీమ్స్, గూగుల్ మీట్ తరహాలో ఈ షెడ్యూల్ కాల్ ఫీచర్ ను తాజాగా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్ తో ఉద్యోగులు, స్నేహితులు, ఫ్యామిలీతో మీటింగ్ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. వాయిస్ తో పాటు వీడియో కాల్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.

కాల్ పెడుతున్న ఉద్దేశం ఇందులో చెప్పుకోవచ్చు. ఎవరు కనెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. జనరేట్ అయిన లింకును కాపీ చేసి అందులో పాల్గొనే వాళ్లకు షేర్ చేసుకోవచ్చు. కాల్ మొదలయ్యే ముందు మనం అనుకున్న వాళ్లకు నోటిఫికేషన్ ఆటోమేటిగ్గా వెళుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు. ఇక వాట్సాప్ లో షెడ్యూల్ ఫీచర్ అందుబాటులోకి రావ‌డంపై జ‌నాలు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story