- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంసంగ్ నుంచి నయా ఫోన్..కేవలం రూ.12వేలకే...ఫీచర్స్ ఇవే
శాంసంగ్ ఎం సిరీస్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం 17 5జీ Samsung Galaxy M17 5G పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చారు

దిశ, వెబ్ డెస్క్ : శాంసంగ్.... మన ఇండియాలో ఈ బ్రాండ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ కంపెనీ నుంచి రకరకాల మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా Samsung కంపెనీ నుంచి మరో సరికొత్త సేఫ్టీ మొబైల్ వచ్చింది. శాంసంగ్ ఎం సిరీస్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం 17 5జీ ( Samsung Galaxy M17 5G ) పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే అక్టోబర్ 13వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభం అవుతాయి. రిటైల్ అలాగే ఈ-కామర్స్ లో ఈ మొబైల్ కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, ఎలాంటి సైబర్ అటాక్స్ జరగకుండా ప్రొటెక్షన్ మొబైల్ కు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంటే ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుందట. ఈ మొబైల్ 6.7 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా వచ్చేసి 50 మెగాఫిక్సల్ ఉంటుంది. సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఇచ్చారు. సఫైర్ బ్లాక్, మూన్ లైట్ సిల్వర్ కలర్లలో ఈ మొబైల్ మార్కెట్ లో లభించనుంది. 4జీబీ+128 జీబీ మోడల్ మొబైల్ ధర 12,499 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇందులో 6జీబీ+128జీబీ మొబైల్ ఫోన్ 14,000 రూపాయలుగా ఉంది. 8జీబీ+128జీబీ మొబైల్ 15,499 రూపాయలకు అందిస్తున్నారు. అంటే ఈ ఫోన్స్ సామాన్యులు కూడా కొనుగోలు చేసే విధంగా ధరలు ఫైనల్ చేశారు.






