NIA Raids: టెర్రర్ లింక్స్ కేసు.. విజయవాడలో ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-08 03:24:51  IST  )

రాష్ట్రంలో ఎన్‌ఐఏ (NIA) అధికారుల ఆకస్మిక సోదాలు తీవ్ర కలకలం రేపాయి.

NIA Raids: టెర్రర్ లింక్స్ కేసు.. విజయవాడలో ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ (Vijayawada)లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఇవాళ తెల్లవారుజామున ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నగరంలోని వించిపేట (Vinchipeta) ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఎన్‌ఐఏ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఇటీవల వెలుగుచూసిన ఉగ్రవాద సంబంధాల కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వించిపేటలోని అనుమానితుల ఇళ్లు, వారు నివసిస్తున్న ప్రాంతాలను ఎన్‌ఐఏ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, గతేడాది మార్చి, మే నెలల్లో ఇదే ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ విజయవాడకు చెందిన మహహ్మద్ డానిష్, సుహైల్ బేగ్, మహమ్మద్ రహంతుల్లాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇక టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో నమోదైన టెర్రర్ సింపతైజర్స్ కేసు (Terror Sympathizers Case)ను ఎన్‌ఐఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాధారాలు, ఇతర రాష్ట్రాలతో ఉన్న లింకులపై లోతుగా దర్యాప్తు చేయడంలో భాగంగానే ఈ తాజా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభ్యమయ్యాయనే దానిపై ఎన్‌ఐఏ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అయితే, ఉదయాన్నే భారీగా కేంద్ర బలగాలు, అధికారులు మోహరించడంతో వించిపేట పరిసర ప్రాంతాల్లో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story