- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ - శ్రీ విష్ణు కాంబో చిత్రానికి మాస్ టైటిల్ ఫిక్స్
రవితేజ - శ్రీ విష్ణు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి 'వీరాధి వీరులట' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు హీరోలుగా హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చిత్రానికి ఓ పవర్‌ఫుల్ మాస్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు 'వీరాధి వీరులట' అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే ఈ టైటిల్‌తో పాటు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకుంటే చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించాల్సి ఉంటుంది. లేదంటే సమయం చాలా తక్కువగా ఉండడంతో షూటింగ్‌ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం కష్టమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.






