'లెనిన్'కు పోటీగా రెండు చిత్రాలు.. మైత్రి శశి ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

జూలై 10వ తేదీన మైత్రి సంస్థ 'హృదయం మురళి', 'ఐ నోబడీ' చిత్రాలను తెలుగులో విడుదల చేయనుంది.

లెనిన్కు పోటీగా రెండు చిత్రాలు.. మైత్రి శశి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ రంగంలోనే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ భారీ స్థాయిలో ఎదిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థ వరుసగా పలు చిత్రాలను విడుదల చేస్తూ తన సత్తా చాటుతోంది. ఇందులో భాగంగా జూలై 10న 'హృదయం మురళి', 'ఐ నోబడీ' అనే రెండు డబ్బింగ్ చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. అదే రోజు అఖిల్ హీరోగా రూపొందిన 'లెనిన్' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా 'హృదయం మురళి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మైత్రి శశికి, "లెనిన్ సినిమాతో పోటీగా జూలై 10న రెండు డబ్బింగ్ సినిమాలను విడుదల చేయడం సరైన నిర్ణయమేనా?" అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి ఆయన స్పందిస్తూ, "సినిమా ఇండస్ట్రీలో మంచి సీజన్‌లో ఒకేసారి అనేక సినిమాలు విడుదల కావడం సహజమే. గతంలో సంక్రాంతి సందర్భంగా నాలుగు సినిమాలు విడుదలై, నాలుగూ విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. జూలై 10న ప్రేక్షకులు ముందుగా 'లెనిన్' సినిమాను చూసి, ఆ తర్వాత శని, ఆదివారాల్లో మా చిత్రాలను కూడా చూస్తారు. అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాం" అని తెలిపారు.

Next Story