- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపిల్‌కి పోటీగా శాంసంగ్ గెలాక్సీ XR హెడ్‌సెట్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
ఆపిల్‌కు పోటీగా శామ్‌సంగ్ తన మొదటి ఎక్స్ టెండెడ్ రియాలిటీ హెడ్ సెట్ ను తీసుకువచ్చింది. అక్టోబర్ 2025 గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో ఈ హెడ్ సెట్ ను ఆవిష్కరించింది. ఆపిల్ విజన్ ప్రోకు దీనిని పోటీగా తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది. దీనిని అగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీతో రూపొందించారు.

దిశ, వెబ్ డెస్క్: ఆపిల్‌కు పోటీగా శామ్‌సంగ్ తన మొదటి ఎక్స్ టెండెడ్ రియాలిటీ హెడ్ సెట్ ను తీసుకువచ్చింది. అక్టోబర్ 2025 గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో ఈ హెడ్ సెట్ ను ఆవిష్కరించింది. ఆపిల్ విజన్ ప్రోకు దీనిని పోటీగా తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది. దీనిని అగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీతో రూపొందించారు. అంతే కాకుండా గూగుల్, క్వాల్ కామ్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేశారు.
ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో ఈ హెడ్ సెట్ అందుబాటులో ఉండగా త్వరలోనే దీనిని భారత్ తో పాటు ఇతర దేశాల్లో సైతం విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇండియాలో దీని ధర రూ.1.58 లక్షల రూపాయలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే.. సెన్సార్స్ సహాయంతో ఇందులో హ్యాండ్ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు చేతి సంకేతాలతో యాప్స్ ను నియంత్రించవచ్చు.
ఇందులో 16జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజీ ఉంటుంది. అదే విధంగా 4కే మైక్రో ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ XR2+ Gen2 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. వీటితో పాటు ఇందుల గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనితో 3డీ ఫోటోలు, వీడియోలు సైతం క్యాప్చర్ చేయవచ్చు. అంతే కాకుండా సేఫ్టీ కోసం దీనిలో ఐరిస్ రికగ్నిషన్ ఉంది. అయితే ఇది ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అనేదానిపై శాంసంగ్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.






