- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samsung Galaxy: శాంసంగ్ లవర్స్ కు గుడ్ న్యూస్..కొత్త మూడు ఫోన్లు వచ్చేస్తున్నాయి
శాంసంగ్ గెలాక్సీ ఆన్ ప్యాక్డ్ 2026 ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో S26 సిరీస్ కు సంబంధించిన ఫోన్లను రిలీజ్ చేయనున్నారు. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే... శాంసంగ్ గెలాక్సీ S26, ఎస్ 26+, ఎస్ 26 ఆల్ట్రా పేరుతో ఈ ఫోన్స్ తీసుకొస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మన ఇండియన్ మార్కెట్ లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. పుట్ట గొడుగుల్లాగా కొత్త కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి. ప్రతి మనిషి ఒకటి కంటే ఎక్కువగా మొబైల్స్ వాడేస్తున్నారు. దీంతో రక రకాల ఫీచర్స్ తో కొత్త ఫోన్స్ మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. అయితే మన ఇండియాలో శాంసంగ్ కంపెనీకి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థనే ఈ శాంసంగ్. ఎన్నో ఏండ్ల నుంచి మన ఇండియాలో పాతుకుపోయింది. సెక్యూరిటీ, అదిరిపోయే ఫీచర్స్ తో శాంసంగ్ నుంచి చాలా ఫోన్స్ వస్తున్నాయి. కాస్త ధర ఎక్కువైనా కూడా.. మంచి బ్రాండ్ కావడంతో జనాలు కొనేందుకు ఇవ్వబడతారు.
అయితే ఈ నేపథ్యంలోనే శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ మెగా ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. గెలాక్సీ ఆన్ ప్యాక్డ్ 2026 ( Samsung Galaxy Unpacked 2026) పేరుతో ఈ సారి ఈవెంట్ నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ గెలాక్సీకి సంబంధించిన ఎస్ 26 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ( Galaxy S26 ) కూడా లాంచ్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రీ రిజర్వేషన్లకు కూడా ఛాన్స్ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఆన్ ప్యాక్డ్ 2026 ఈవెంట్ ఫిబ్రవరి 25వ తేదీన జరగనుండగా.. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వేదిక కానుంది. అమెరికాలో జరుగనుంది కాబట్టి ఇండియన్ కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని శాంసంగ్ యూట్యూబ్ ఛానల్ లేదా అఫీషియల్ వెబ్సైట్ లో మనం తిలకించవచ్చు.
మార్కెట్లోకి మూడు కొత్త మొబైల్ ఫోన్లు
శాంసంగ్ గెలాక్సీ ఆన్ ప్యాక్డ్ 2026 ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో S26 సిరీస్ కు సంబంధించిన ఫోన్లను రిలీజ్ చేయనున్నారు. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే... శాంసంగ్ గెలాక్సీ S26, ఎస్ 26+, ఎస్ 26 ఆల్ట్రా పేరుతో ఈ ఫోన్స్ తీసుకొస్తున్నారు. అయితే ఫిబ్రవరి 25వ తేదీన విడుదల కానున్న ఎస్ 26 అల్ట్రా మొబైల్ ఫోన్ అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతుంది. ఇందులో గ్రేడ్ చేసిన 200 ఎంపీ మెయిన్ కెమెరా కూడా ఉంటుంది. పవర్ ఫుల్ చిప్ సెట్ కూడా అందిస్తున్నారు. ఇక ఇదే రోజున మొబైల్ ఫోన్స్ తో పాటు కొత్తగా గెలాక్సీ బడ్స్ తీసుకురాబోతోంది samsung. శాంసంగ్ గెలాక్సీ buds 4, బడ్స్ 4 ప్రో పేరుతో వీటిని తీసుకువస్తున్నారు. ఇక ముందస్తు బుకింగ్ కోసం ప్రీ రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభించింది ఈ కంపెనీ. మన ఇండియన్స్ వెయ్యి రూపాయలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. శాంసంగ్ ( samsung) వెబ్సైట్ ఇండియా ద్వారా ఈ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రీ రిజర్వ్ చేసుకున్న వారికి దాదాపు 2699 రూపాయల డిస్కౌంట్ లభించనుంది.






