- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ శాంసంగ్ ఫోన్ పై రూ.10 వేల సమ్మర్ ఆఫర్..పూర్తి వివరాలు ఇవే
శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా మొబైల్ పైన రూ.10 వేల భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ.

దిశ, వెబ్ డెస్క్: శాంసంగ్ మొబైల్స్ కు ఉన్న డిమాండ్ అంతా కాదు. ఇండియాలో ఐఫోన్ ను కొనుగోలు చేసినట్లుగానే శాంసంగ్ కోసం జనాలు ఎగబడతారు. సేఫ్టీతో పాటు మంచి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కాస్త ధర ఎక్కువైనప్పటికీ, శాంసంగ్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. అయితే లేటెస్ట్ గా శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా ( Samsung Galaxy S25 Ultra) మొబైల్ పైన భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. ఈ ఫోన్ పై పది వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
ఈ ఫోన్ లాంఛ్ అయినప్పుడు రూ.1.29 లక్షలుగా ఉండేది. ఇప్పుడు ఈ ఫోన్ పై నేరుగా పది వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే రూ.1.19 లక్షలకు రానుంది. అలాగే బ్యాంక్ ఆఫర్ల రూపంలో కూడా మరింత డిస్కౌంట్ లభించనుంది. HDFC, ICICI బ్యాంక్ కు సంబంధించిన క్రెడిట్ కార్డులు వాడి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 5 వేల వరకు ఇనిస్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మరింత బోనస్ లభిస్తుంది. EMI ఆప్షన్ కూడా అందిస్తున్నారు.






