ఈ శాంసంగ్ ఫోన్ పై రూ. 24 వేల ఆఫ‌ర్‌..వివ‌రాలు ఇవే !

by velandi.Saikiran |

Samsung Galaxy S25 5జీ మొబైల్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించారు.

ఈ శాంసంగ్ ఫోన్ పై రూ. 24 వేల ఆఫ‌ర్‌..వివ‌రాలు ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్ లో శాంసంగ్ మొబైల్స్ కు మంచి గిరాకీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఐ ఫోన్ తర్వాత ఎక్కువగా శాంసంగ్ మొబైల్స్ కొనుగోలు చేస్తారు జనాలు. సేఫ్టీతో పాటు మంచి ఫీచర్స్ ఉంటాయన్న కారణాలతో ఆసక్తి చూపిస్తారు వినియోగదారులు. అయితే దానికి తగ్గట్టుగానే శాంసంగ్ కూడా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా Samsung Galaxy S25 5జీ మొబైల్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఫ్లిప్ కార్ట్ లో ఈ మొబైల్ కొనుగోలు చేస్తే, దాదాపు రూ. 24 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది.

జనవరి 2025లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆ సమయంలో ఈ మొబైల్ ధర రూ.80, 999. అయితే ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో సేల్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.24,000 వరకు డిస్కౌంట్ లభించనున్నట్లు తాజాగా ప్రకటన చేశారు. అంటే ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.56,999 కు లభించనుంది. అలాగే ఈ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డులు వాడితే మరింత ఆఫర్ రానుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.2 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 4000 mah బ్యాటరీ సామర్థ్యంతో ఈ మొబైల్ వచ్చింది. 25W ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ నడుస్తుంది. 50 ఎంపీతో ప్రైమరీ కెమెరా రానుండగా సెల్ఫీల కోసం 12MP కెమెరా అందిస్తున్నారు.

Next Story