శాంసంగ్ డిజిటల్ కీ.. ఇకపై ఫోన్‌తోనే కారు అన్ లాక్

by Ajay Maddhiboyina |

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ కీలక ఫీచర్ తీసుకువచ్చింది. శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ లో కార్ అన్‌లాకింగ్ ఫీచర్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఫిజికల్ కీ లేకుండా ఫోన్‌తోనే కారును స్టార్ట్ చేయడం, అన్ లాక్ చేయడం లాంటివి చేయవచ్చు.

శాంసంగ్ డిజిటల్ కీ.. ఇకపై ఫోన్‌తోనే కారు అన్ లాక్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ కీలక ఫీచర్ తీసుకువచ్చింది. శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ లో కార్ అన్‌లాకింగ్ ఫీచర్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఫిజికల్ కీ లేకుండా ఫోన్‌తోనే కారును స్టార్ట్ చేయడం, అన్ లాక్ చేయడం లాంటివి చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఇది మహీంద్రా ఎలక్ట్రికల్ ఎస్‌యూవీ వాహనాలకు మాత్రమే పనిచేస్తుంది. అంతే కాకుండా డిజిటల్ కార్ కీ పేరుతో గెలాక్సీ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, అల్ట్రా వైడ్ బ్యాండ్, టెక్నాలజీల సాయంతో ఇది పనిచేస్తుంది. కార్ మోడల్ ఆధారంగా డిజిటల్ కీ అనుసంధానం అవుతుంది. అంతే కాకుండా ఒకసారి ఫోన్ లోని యాప్ తో పెయిర్ చేసిన తరవాత యూజర్ ఫోన్ ను కారుకు దగ్గరగా తీసుకెళ్లగానే ఆటోమెటిక్‌గా అన్ లాక్ అవుతుంది. డిజిటల్ కీ యాప్ ద్వారా ఇతరులకు సైతం కారు యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫోన్ పోగొట్టుకుంటే లేదా మర్చిపోతే శాంసంగ్ ఫైండ్ సర్వీసెస్ ద్వారా రిమోట్ గా కీ ని లాక్ చేయవచ్చు, లేదంటే పూర్తిగా తొలగించవచ్చు.

Next Story