ఇండియన్ మార్కెట్ లోకి రెడ్ మీ 15.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-19 15:02:31  IST  )

ప్ర‌ముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ ఇండియ‌న్ మార్కెట్‌లోకి రెడ్ మీ 15 మోడల్‌ను విడుదల చేసింది. రెడ్ మీ 13 యొక్క అప్డేట్ వర్షన్‌‌గా రెడ్ మీ 15‌ను తీసుకువచ్చారు.

ఇండియన్ మార్కెట్ లోకి రెడ్ మీ 15.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్ర‌ముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ ఇండియ‌న్ మార్కెట్‌లోకి రెడ్ మీ 15 మోడల్‌ను విడుదల చేసింది. రెడ్ మీ 13 యొక్క అప్డేట్ వర్షన్‌‌గా రెడ్ మీ 15‌ను తీసుకువచ్చారు. ఈ ఫోన్‌లో Snapdragon 6s Gen 3 ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ ఉంది. 6.9 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండటంతో పాటు మంచి ప్రాసెసర్ ఉండటంతో ఇది గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఫోన్‌లో 6.9 అంగుళాల డిస్ ప్లే ఉండటం వల్ల వీడియోలు చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో హైపర్ ఓఎస్ 2తో వస్తోంది. కాబట్టి డేటా సెక్యురిటీలోనూ ఈ మోడల్ బెస్ట్ అనే చెప్పాలి.

కెమెరాల విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ డ్యూయల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతో పాటు ఏఐ స్కై, ఏఐ ఎరేస్, ఏఐ బ్యూటీ లాంటి అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్‌తో పనిచేసే కెెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్స్‌లో ఫ్రాస్టెడ్ వైట్, శాండీ పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్ అనే మూడు రంగుల్లో ఫోన్లు ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే ఈ ఫోన్ మూడు వేరియంట్‌లలో ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమోరీ ఉన్న మోడల్‌కు రూ.14,999లుగా ఉంది. 8GB + 128GB రూ.15,999, మరియు 8GB + 256GB రూ.16,999లుగా ఉంది. రెడ్ మీ 15 ఫోన్ బ్రాండ్ స్టోర్లతో పాటు ఇతర ఈకామ్ వెబ్ సైట్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. రెడ్ మీ అఫీషియల్ వెబ్ సైట్‌లోనూ ఈ మోడల్ అందుబాటులో ఉంది.

Next Story