స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే తొలిసారి.. బాహుబలి బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్

by Naga Rani Yarlagadda |

స్మార్ట్ ఫోన్ చరిత్రలోనే తొలిసారి రియల్ మీ ఒక నూతన ఫోన్ ను తీసుకొచ్చింది. యూజర్లను వేధించే సమస్యల్లో ఒకటి బ్యాటరీ లైఫ్.

స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే తొలిసారి.. బాహుబలి బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ చరిత్రలోనే తొలిసారి రియల్ మీ ఒక నూతన ఫోన్ ను తీసుకొచ్చింది. యూజర్లను వేధించే సమస్యల్లో ఒకటి బ్యాటరీ లైఫ్. ఈ ఫోన్ తో ఆ సమస్యకు చెక్ పెట్టేలా బాహుబలి బ్యాటరీతో కొత్త మొబైల్ ను లాంచ్ చేయనుంది. జనవరి 29న Realme P4 Power 5G Bahubali Battery స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 10,001 mAh. భారీ బ్యాటరీ సామర్థ్యం ఉన్నా మొబైల్ సిలికాన్ - కార్బన్ టెక్నాలజీతో సన్నగా, తేలికగానే డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. పైగా బ్యాటరీకి నాలుగేళ్లు హెల్త్ గ్యారెంటీ ఇస్తోంది.

ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల వరకు సులభంగా ఉపయోగించుకోవచ్చని రియల్‌మీ పేర్కొంది. అలాగే 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీ పూర్తి స్థాయిలో ఛార్జ్ అవుతుంది. అదనంగా ఇతర పరికరాలను ఛార్జ్ చేసుకునేందుకు రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు.

డిస్‌ప్లే విషయంలో రియల్‌మీ P4 పవర్ 5Gలో 6.78 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో అందించనున్నారు. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు మరింత స్మూత్ అనుభూతిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐతో పనిచేస్తుంది. మూడు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని రియల్‌మీ హామీ ఇచ్చింది.

కెమెరా విభాగంలో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌కు ఇది మంచి ఎంపికగా నిలుస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ధర విషయానికి వస్తే, రియల్‌మీ P4 పవర్ 5G 12GB/256GB ఫోన్ ను భారత్ లో రూ.37,999కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ మిడ్‌రేంజ్ విభాగంలో మంచి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Next Story