- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Realme GT 8 Pro: ఇండియన్ మార్కెట్‌లోకి రియల్ మీ కొత్త మోడల్.. ధర, ఫీచర్స్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
రియల్ మీ నుండి ఇండియన్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ రాబోతుంది. వచ్చే నెలలో రియల్ మీ జీటీ 8 ప్రో భారత్ లో లాంఛ్ కాబోతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: రియల్ మీ నుండి ఇండియన్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ రాబోతుంది. వచ్చే నెలలో రియల్ మీ జీటీ 8 ప్రో భారత్ లో లాంఛ్ కాబోతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇది స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ ప్రాసెసర్‌తో రాబోతుండగా ఇండియాలోనే అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ కలిగిన ఫోన్ కానుంది. కాబట్టి గేమింగ్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి.
ఇందులో 6.78 అడుగుల 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంది. ఇది మార్కెట్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న GT 7 ప్రోకు అప్డేట్ వర్షన్‌గా వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ ఫోన్ డైజైన్ టెక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000 mAh బ్యాటరీతో దీనిని తీసుకువచ్చారు. ఈ ఫోన్ ఏకంగా 200 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో మార్కెట్ లోకి వస్తోంది.
అంతే కాకుండా అదనంగా 50 మెగాపిక్సల్ లెన్స్ కూడా కెమెరాకు ఉండనున్నాయి. కాబట్టి ఫోటో గ్రఫీ ఇష్టపడేవారికి, కంటెంట్ క్రియేటర్లకు సైతం ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉండనుంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 64,999 నుండి ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రియల్ మీ ఫోన్లకు సైతం ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. రెడ్ మీతో ఈ బ్రాండ్ పోటీ పడుతోంది. ఇక Realme GT 8 Pro మారెట్ లోకి వస్తే జనాలకు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






