Realme GT 7: రూ. 6,700 డిస్కౌంట్..బడ్జెట్ లోనే ఫోన్‌..ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

Realme GT 7 మోడ‌ల్ ఫోన్ పై రూ. 6,700 వ‌ర‌కు డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ.

Realme GT 7 deal Get over Rs 6,700 discount
X

Realme GT 7 deal Get over Rs 6,700 discount

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్ లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వీటన్నిటిలో రియల్ మీ బ్రాండ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లో కచ్చితంగా రియల్ మీ ఫోన్ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. గతంలో అయిన వాడినట్లు రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి. అంతలా ఇండియాలో రియల్ మీ కంపెనీ పాతుకు పోయింది. దానికి తగ్గట్టుగానే మంచి ఫీచర్స్ తో రియల్ మీ ( Realme ) కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తోంది. గతంలో తీసుకువచ్చిన మొబైల్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ కూడా ఇస్తోంది. అయితే తాజాగా రియల్ మీ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. రియల్ మీ GT 7 మొబైల్ ఫోన్ ( Realme GT 7 ) పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వాళ్లకు ఏకంగా రూ. 6700 డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. నేరుగా రూ. 5000 డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా ఇతర రూపంలో రూ.1750 వరకు డిస్కౌంట్ రానుంది.

రియల్ మీ ఫోన్ పై భారీ డిస్కౌంట్

భారత మార్కెట్ లో రియల్ మీ మొబైల్ ఫోన్ లకు తిరుగులేదు. మంచి డిమాండ్ సంపాదించుకుంది రియల్ మీ. అయితే తాజాగా రియల్ మీ GT 7 ( Realme GT 7 ) మోడల్ పైన డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ మొబైల్ ధర ఇండియాలో రూ.39,999 ఉంది. అంటే దాదాపు 40 వేల రూపాయలు. అయితే ఈ మొబైల్ ను ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేస్తే, రూ. 5000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే రూ. 34, 999 లకు ఈ మొబైల్ మన చేతిలోకి వస్తుంది. దానికి తోడు ఎస్బీఐ, యాక్సిస్ ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులు వాడి ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే మరో రూ. 1750 వరకు తగ్గింపు కస్టమర్ పొందుతాడు. ఈ మేరకు న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడి పోతున్నారు.

Realme GT 7 ఫీచర్స్, ధ‌ర‌

రియల్ మీ GT 7 మోడల్ ఫోన్ 2025 మే మాసం 27వ తేదీన ఇండియాలో లాంచ్ అయింది. ఆ సమయంలో ఈ మొబైల్ ధర రూ. 39, 999 ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ మోడల్ ఫోన్ మాత్రమే ఈ ధరకు వస్తుంది. ఇక వేరియంట్ మారిన కొద్ది ధర కూడా పెరుగుతుంది. ఇందులో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్ మొబైల్ రూ.42, 999 ఉంది. ఈ ఫోన్ పై దాదాపు రూ. 6000 వరకు డిస్కౌంట్ ఉంది. 12 జీబీ ర్యామ్+512 జీబీ వేరియంట్ మొబైల్ 46 వేల 99 రూపాయలుగా ఉంది. ఈ ఫోన్‌ పైన కూడా ఆరు వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఈ మోడల్ ఫోన్స్ లో 7000 mah బ్యాటరీ కూడా వస్తోంది. 120 w ఫాస్ట్ చార్జర్ ఈ మొబైల్ కు సపోర్ట్ చేస్తుంది.

Next Story