200MP కెమెరాతో Realme 11 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు.. లాంచ్ తేదీ ఇదే..!

by Disha Web Desk 17 |
200MP కెమెరాతో Realme 11 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు.. లాంచ్ తేదీ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: Realme కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు Realme 11 Pro, Realme 11 Pro+ ఇండియాలో విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ ఫోన్‌లు జూన్ 8న లాంచ్ అవుతాయని కంపెనీ బుధవారం ధృవీకరించింది. ఇవి గతంలో చైనాలో విడుదలయ్యాయి. ఇప్పుడు భారత వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13 ద్వారా రన్ అవుతాయి. ఇవి జూన్ 8 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతాయని కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.



Realme 11 Pro ఫోన్ 6.7-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లేను, Mediatek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్ 108MP + 2MP, ముందు కెమెరా 16MP. బ్యాటరీ విషయానికి వస్తే, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీ ఉంది.


Realme 11 Pro + మోడల్ Mediatek Dimensity 7050 ప్రాసెసర్‌తో, 6.7-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్ 200MP + 8MP + 2MP, ముందు కెమెరా 32MP. 100W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 mAh కెపాసిటీ బ్యాటరీని అందించారు.


Next Story

Most Viewed