పోస్ట్ ఆఫీస్ RD, SIP రెండింటిలో ఏది బెస్ట్..ఐదేళ్లు నెలకు రూ.5వేలు కడితే దేనిలో ఎంత వస్తాయి?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-16 11:58:11  IST  )

ప్రస్తుతం డబ్బు పొదుపు చేసేందుకు కొన్ని సురక్షిత మార్గాలున్నాయి. అందులో (RD) రికరింగ్ డిపాజిట్( recovering deposite) , (SIP) సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (systematic investment plan) ముఖ్యమైనవి. రెండింటిలో ఎందులో డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయో తెలుసుకుందాం..

పోస్ట్ ఆఫీస్ RD, SIP రెండింటిలో ఏది బెస్ట్..ఐదేళ్లు నెలకు రూ.5వేలు కడితే దేనిలో ఎంత వస్తాయి?
X

దిశ, వెబ్ డెస్క్: డ‌బ్బు సంపాదించ‌డం చాలా మందికి తెలుసు. కానీ సంపాదించిన డబ్బును ఎలా ఖ‌ర్చు పెట్టాలో తెలియ‌కపోతే ఎలా వ‌చ్చిందో అలానే పోతుంది. ముఖ్యంగా సంపాదించిన డ‌బ్బులో ఎంతో కొంత సేవింగ్స్ చేయ‌డం ద్వారా భ‌విష్య‌త్‌లో అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కడ సేవింగ్స్ చేయాలో తెలిస్తే ఆ డబ్బు కూడా రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం డబ్బు పొదుపు చేసేందుకు కొన్ని సురక్షిత మార్గాలున్నాయి. అందులో (RD) రికరింగ్ డిపాజిట్( recovering deposite) , (SIP) సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (systematic investment plan) ముఖ్యమైనవి. రెండింటిలో ఎందులో డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయో తెలుసుకుందాం..

పోస్ట్ ఆఫీస్‌లో ఆర్డీ చేయడం:

పోస్ట్ ఆఫీసు (post office)లో డబ్బును ఆర్డీ చేయడం చాలా సురక్షితమైనది. ఇక్కడ డబ్బు పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా మొదట హామీ ఇచ్చినట్టుగా వడ్డీ వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఆర్డీ సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మూడు నెలలకు ఒకసారి చక్రవడ్డీ వస్తుంది. ఇక ఐదేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున ఆర్డీ చేస్తే మొత్తం రూ.3,56,830 వస్తాయి. తక్కువ రిస్క్ కోరుకునేవారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

SIPలో పెట్టుబడి పెట్టడం:

ప్రస్తుతం చాలా మంది SIPలో పెట్టుబడులు పెడుతున్నారు. అధిక మొత్తంలో వడ్డీ రావడంతో సిప్‌ను ఎంచుకుంటున్నారు. SIP అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఓ మార్గం. కాబట్టి స్టాక్ మార్కెట్‌పై ఆధారపడి ఇందులో రాబడి ఉంటుంది. సిప్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా వార్షిక రాబడి దాదాపు 12 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్ల పాటు సిప్‌లో నెలకు రూ.5వేలు పెట్టుబడి పెడితే మొత్తం రూ.3లక్షలు అవుతాయి. దానికి 12 శాతం వడ్డీ అనుకుంటే వడ్డీ దాదాపు రూ.1,05,518 అవుతుంది. దీంతో చేతికి మొత్తం రూ.4,05,518 వస్తాయి. స్టాక్స్ లో లాభాలు వస్తే రిటర్న్స్ పెరగవచ్చు, తగ్గితే తగ్గవచ్చు.

Next Story