6500 mah బ్యాట‌రీతో Poco నుంచి రెండు ఫోన్లు..ధ‌ర ఎంతంటే ?

by velandi.Saikiran |

Poco M8, Poco M8 Pro పేరుతో ఈ రెండు ఫోన్లు ఇండియాలో జ‌న‌వ‌రిలో లాంచ్ కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

6500 mah బ్యాట‌రీతో Poco నుంచి రెండు ఫోన్లు..ధ‌ర ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పటికే రకరకాల ఫోన్స్ ఇండియాలో లాంచ్ చేశాయి పలు రకాల కంపెనీలు. ఇలాంటి నేపథ్యంలో POCO నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది. Poco M8 సిరీస్ ఇండియాలో కూడా లాంచ్ కానుంది. జనవరిలో ఈ సిరీస్ లో భాగంగా రెండు ఫోన్లు తీసుకురాబోతున్నారట. Poco M8, Poco M8 Pro పేరుతో ఈ రెండు ఫోన్లు ఇండియాలో జ‌న‌వ‌రిలో లాంచ్ కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఇందులో Poco M8 మోడల్ ఫోన్ 6.77 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉండనుందట. 50 ఎంపీ మెయిన్ కెమెరా కూడా అందిస్తున్నారు. 5520 mah బ్యాటరీ సామర్థ్యంతో ఈ మొబైల్ లాంచ్ కాబోతున్నట్లు చెబుతున్నారు. 45W ఉన్న ఛార్జర్ మాత్రమే ఈ ఫోన్ కు సపోర్ట్ చేయనుంది. ఇక ఈ మొబైల్ ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Poco M8 Pro విషయానికి వస్తే... ఈ ఫోన్ 6.83 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 50 mp ప్రైమరీ కెమెరా సెన్సార్ తో లాంచ్ చేయనున్నారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. అయితే 6500 mah బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. 100w ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. ఇక ఈ మొబైల్ ధర రూ. 18 వేల నుంచి రూ. 25 వేల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Next Story