- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
POCO F4: డీల్ అంటే ఇదే... రూ.35వేల ఫోన్ రూ.20వేలకే!
దసారా పండుగ దగ్గర పడటంతో ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్స్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దసరా పండుగ దగ్గర పడటంతో ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్స్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 22 నుండి ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ (flipkart big billion days) సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఆఫర్ రోజుల్లో చాలా ఫోన్స్ ధర తగ్గే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఫోన్స్ కొంటే మంచిదని కస్టమర్లకు పలు సూచనలు చేస్తున్నారు. టెక్ నిపుణుల ప్రకారం ధర భారీగా తగ్గే ఫోన్లలో POCO F4 కూడా ఉంది.
ఈ ఫోన్ ఇండియాలో లాంఛింగ్ ధర రూ.35,000 పైనే ఉండగా బిగ్ బిలియన్ డేస్ లో రూ.20వేలలోనే రాబోతుందట. ఈ ఫోన్‌లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయని, చాలా తక్కువ ధరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ కి రాబోతుందని చెబుతున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే 12 GB RAM, 256 GB ఇంటర్నల్ మెమోరీ ఉంది. 6.67 inch ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో దీనిని డిజైన్ చేశారు.
కెమెరా విషయానికి వస్తే ఇందులో64 మెగాపిక్సల్ రేర్ ట్రిపుల్ కెమెరా ఉంది. అంతే కాకుండా 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దీంతో ఫోటోల కోసం ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఇందులో 4500 ఎంఏహెచ్ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసెర్‌తో మంచి పర్ఫామెన్స్ ఇస్తుంది. కాబట్టి గేమింగ్ ప్రియులకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.






