- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PNB KSAN TATKAL RIN YOJANA: ఎలాంటి హామీ లేకుండా అప్లై చేసిన వెంటనే రూ.50వేలు లోన్ ఇచ్చే పథకం.. ఇలా అప్లై చేసుకోండి?
ఎంతో కష్టపడి పంటలు పండించినా రైతులు మాత్రం ఎప్పుడూ పేదవాళ్లుగానే ఉంటారు. మధ్యలో వారితో వ్యాపారం చేసిన దళారులు, వ్యాపారులు మాత్రం కోట్లు సంపాదిస్తుంటారు. కొన్నిసార్లు అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకు,

దిశ, వెబ్ డెస్క్: ఎంతో కష్టపడి పంటలు పండించినా రైతులు మాత్రం ఎప్పుడూ పేదవాళ్లుగానే ఉంటారు. మధ్యలో వారితో వ్యాపారం చేసిన దళారులు, వ్యాపారులు మాత్రం కోట్లు సంపాదిస్తుంటారు. కొన్నిసార్లు అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకు, లేదా పంటలు పండించేందుకు సైతం వారి దగ్గర డబ్బులు ఉండవు. దీంతో అధిక వడ్డీలకు వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని అప్పుల పాలు అవుతుంటారు. అలాంటి రైతుల కోసం కేంద్రం ఓ పథకాన్ని తీసుకువచ్చింది.
అదే పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ రిన్ యోజన (PNB KSAN TATKAL RIN YOJANA). ఈ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా లోన్ ఇస్తారు. అయితే అది పంజాబ్ నేషనల్ బ్యాంకు (PANJAB NATIONAL BANK)లో మాత్రమే రైతులు ఈ రుణాన్ని పొందవచ్చు. గతలంలోనే రైతులకు రుణాలు ఇచ్చేవారు కానీ అప్పుడు బంగారం లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తనాఖా పెట్టాల్సి ఉండేది. కానీ పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ రిన్ యోజన పథకం కింద కనీస డాక్యుమెంట్లు సమర్పించి వెంటనే బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం ఉంది.
మీ గత రెండేళ్ల క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రైతులు ఈ లోన్ పొందాలి అంటే ముందు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకుని ఉండాలి. ఈ పథకం ద్వారా లోన్ తీసుకుంటే 5ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.100 చెల్లించి ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు. రైతులు ఈ లోన్ తీసుకునేందుకు పంజాబ్ నేషన్ బ్యాంకును లేదా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.






