- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OPPO Reno15 Series: ఒప్పో నుంచి 4 ఫోన్లు... ధర, ఫీచర్స్ ఇవే
ఒప్పో రెనో 15 ( OPPO Reno 15), ఒప్పో రెనో 15 సి (OPPO Reno 15c), ఒప్పో రెనో 15 ప్రో (OPPO Reno 15 Pro), ఒప్పో రేనో 15 ప్రో మినీ ( OPPO Reno 15 Pro Mini ) పేరుతో మొత్తం నాలుగు ఫోన్లను తీసుకువచ్చింది కంపెనీ.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో మార్కెట్లోకి రకరకాల ఫోన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒప్పో తన రెనో 15 సిరీస్ లో ( OPPO Reno15 Series ) ఏకంగా నాలుగు మొబైల్స్ లాంచ్ చేసింది. 2024 సంవత్సరంలో రెనో 14 సిరీస్ లాంచ్ చేసి ప్రభంజనం సృష్టించింది ఒప్పో. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెనో 15 సిరీస్ లో నాలుగు ఫోన్లను తీసుకువచ్చింది. ఇందులో ఒప్పో రెనో 15 ( OPPO Reno 15), ఒప్పో రెనో 15 సి (OPPO Reno 15c), ఒప్పో రెనో 15 ప్రో (OPPO Reno 15 Pro), ఒప్పో రేనో 15 ప్రో మినీ ( OPPO Reno 15 Pro Mini ) పేరుతో మొత్తం నాలుగు ఫోన్లను తీసుకువచ్చింది కంపెనీ.
OPPO Reno15 Series కొత్త ఫోన్ల ధరలు ఇవే
OPPO Reno 15c మొబైల్ 8GB+256GB వేరియంట్ ధర రూ. 34,999 గా ఫిక్స్ చేసింది కంపెనీ. 8GB+256GB ఉన్న OPPO Reno 15 ఫోన్ ధర రూ.45,999గా నిర్ణయించారు. 12GB+256GB స్టోరేజ్ కలిగి ఉన్న OPPO Reno 15 Pro ధర రూ. 67,999గా ఫైనల్ చేశారు. 12GB+256GB స్టోరేజ్ ఉన్న OPPO Reno 15 Pro Mini రూ.59,999గా నిర్ణయించారు. ఇక ఈ ఒప్పో తన రెనో 15 సిరీస్ ఫోన్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.






