ఈ OPPO ఫోన్ పై 11వేల డిస్కౌంట్‌...ధ‌ర‌, ఫీచ‌ర్స్‌ !

by velandi.Saikiran |

ఒప్పో రెనో 11 ప్రో 5G మొబైల్ పైన ( OPPO Reno11 Pro 5G) భారీ డిస్కౌంట్ ప్రకటించారు.

ఈ OPPO ఫోన్ పై 11వేల డిస్కౌంట్‌...ధ‌ర‌, ఫీచ‌ర్స్‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్ లో రకరకాల ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. ఇక మరికొన్ని మొబైల్స్ పై డిస్కౌంట్ కూడా ప్రకటిస్తున్నారు. తాజాగా ఒప్పో రెనో 11 ప్రో 5G మొబైల్ పైన ( OPPO Reno11 Pro 5G) భారీ డిస్కౌంట్ ప్రకటించారు. దాదాపు 11,000 డిస్కౌంట్ తో ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ లో లభించనుందట. వాస్తవంగా ఈ మొబైల్ ధర 39,999 రూపాయలుగా ఉంది. అయితే డిస్కౌంట్ పోగా 29,999 రూపాయలకు ఫ్లిప్ కార్ట్ లో వస్తుంది. అంటే దాదాపు 10 వేల రూపాయల తగ్గింపుతో అందిస్తున్నారు.

అంతేకాదు బ్యాంక్ ఆఫర్లతో మరింత ఈ మొబైల్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ లో కొనేటప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడితే 1500 వరకు డిస్కౌంట్ లభించే ఛాన్స్ ఉంది. అంటే మొత్తంగా రూ.11,500 డిస్కౌంట్ రాబోతుంది. ఇక ఈ OPPO Reno11 Pro 5G ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే.. 6.7 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ OPPO, మీడియాటెక్ డిమెన్ సిటీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరా కూడా అందిస్తున్నారు. 50 mp+32mp+8mp అల్ట్రా వైడ్ తో ప్రధాని కెమెరా రాబోతుంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. 4600 బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 వెర్షన్ ఆధారంగా పనిచేస్తుంది.

Next Story