Big Battery Phones: ఒకసారి ఛార్జ్ చేస్తే మళ్ళీ అక్కర్లేదు.. రాబోతున్న కొత్త బ్యాటరీ లాంచ్ ఫీచర్స్ ఇవే

by Vennela |
Big Battery Phones: ఒకసారి ఛార్జ్ చేస్తే మళ్ళీ అక్కర్లేదు.. రాబోతున్న కొత్త బ్యాటరీ లాంచ్ ఫీచర్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: Big Battery Phones: సాధారణంగా స్మార్ట్ ఫోన్ వాడేవారు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో చార్జింగ్ కూడా ఒకటి. ఏ స్మార్ట్ ఫోన్ తీసుకున్నా రోజంతా వాడాక మళ్లీ సాయంత్రానికి చార్జింగ్ చేయాల్సిందే. ఏమీ వాడకపోతే మరో పూట అదనంగా వస్తుంది. కొంచెం అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ కలిగిన ఫోన్ వాడాలంటే బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది. పైగా చేతిలో ఇమడము కష్టమే. ఇకపై అలాంటి బాధలు ఉండవు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పుడు అధిక సామర్థ్యంతో కూడిన బ్యాటరీ కలిగిన ఫోన్లపై ఫోకస్ పెట్టాయి .

చాలా వరకు ఫోన్లు 7000 ఎం ఏ హెచ్ ప్లస్ బ్యాటరీ కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అది కూడా ఆ స్మార్ట్ఫోన్లు మరింత స్లిమ్ గా ఉండనున్నాయి. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ లలో 2000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే చాలా గొప్ప విషయం. తరువాత 3000ఎంఏహెచ్, 4000ఎంఏహెచ్, 5000ఎంఏహెచ్ అంటూ క్రమంగా ఈ బ్యాటరీ కెపాసిటీని పెంచుకుంటూ వచ్చాయి. బ్యాటరికి క్షణాల్లో చార్జింగ్ చేయడం కోసం 100వాట్స్, 120 వాట్స్ తో ఫాస్ట్ చార్జర్ కూడా అందిస్తున్నాయి.తాజాగా మార్కెట్లోకి లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లో అన్ని దాదాపు 5000mah నుంచి 6000ఎంఏహెచ్ కెపాసిటీ ఉంటున్నాయి.

తాజాగా ఐకూ సంస్థ 7300 ఎంహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ను పెద్ద బ్యాటరీ స్మార్ట్ ఫోన్లకు ఈ కంపెనీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఇతర సంస్థలు కూడా బిగ్ బ్యాటరీ ఫోన్లకు రెడీ అవుతున్నాయి. దీంతో తరచూ ఎదుర్కొనే చార్జింగ్ సమస్య తీరిపోనుంది. ఎంచక్కా రెండు రోజులపాటు ఫోన్ వాడుకునే వెసులుబాటు కూడా దొరకనుంది.

ఐకూ సంస్థ జెడ్ 10ను ఇటీవలే లాంచ్ చేసింది. దీంట్లో 7300 ఎం ఏ హెచ్ బ్యాటరీని ఇచ్చింది. ఈ ఫోన్ తో 52 గంటలకు పాటు కాల్ మాట్లాడుకోవచ్చు. 15 గంటలపాటు గేమ్స్ ఆడుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. 90 వాట్స్ చార్జర్ ను బాక్స్ తో పాటే అందిస్తోంది. ఇతర బ్యాట్ ఇంత బ్యాటరీ ఉన్న బరువు 199 గ్రాములే. దీని మందం 7.89 ఎంఎం మాత్రమే. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11న మార్కెట్లోకి లాంచ్ అయింది

వన్ ప్లస్ సంస్థ సిఈ4 కు కొనసాగింపుగా నార్డ్ సీఈ5 ఫై ని మార్కెట్లోకి తీసుకురానుంది. గత ఏడాది ఫిబ్రవరిలో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో తీసుకురాగా సీఈ 5 ని 7000 mah బ్యాటరీతో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేనెల భారత్లో ఈ ఫోన్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఒప్పో సంస్థ కే12 స్మార్ట్ ఫోన్ కు కొనసాగింపుగా k13 స్మార్ట్ ఫోన్ను ఏప్రిల్ 21న మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఇందులో 7000ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వబోతోంది. 8.455 ఎంఎం మందంతో ఈ ఫోన్ విడుదల కానుంది. బరువు సుమారు 25 గ్రాములు ఉంటుంది. 80 వాట్స్ చార్జింగ్ ఇవ్వనున్నారు. ధర ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.




Next Story

Most Viewed