OPPO K14 5G: 2026లోనే మోస్ట్ బ‌డ్జెట్ ఫోన్..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

2026లోనే మోస్ట్ బ‌డ్జెట్ ఫోన్ గా OPPO K14 5G అంటూ నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

OPPO K14 5G: 2026లోనే మోస్ట్ బ‌డ్జెట్ ఫోన్..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఐతే, మిడిల్ క్లాస్ వాళ్లను అట్రాక్ట్ చేసే ఫోన్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి ఫోన్ లలో ఒప్పో K14 5G ( OPPO K14 5G ) మొబైల్ ఒకటి. 2026 లో బడ్జెట్ ధరలో, మంచి ఫీచర్స్ తో వచ్చింది ఈ ఫోన్. దీంతో జనాలు కూడా ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫోన్స్‌ విక్రయాలు కూడా క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.

2026 మార్చి లో లాంచ్ అయిన ఈ ఒప్పో ఫోన్ ధర రూ.18 వేలుగా ఉంది. 6.75 అంగుళాల డిస్ ప్లేతో వచ్చిన ఈ మొబైల్, 7000mah బ్యాటరీతో రానుంది. 50 ఎంపీతో బ్యాక్ కెమెరా రానుండగా, సెల్ఫీల కోసం అదిరిపోయే కెమెరా అందిస్తున్నారు. 6300 మీడియాటెక్ డైమన్ సిటీ చిప్ సెట్. 6gb+128gb స్టోరేజ్ ఉన్న మొబైల్ ధర రూ.17, 999గా ఉంటుంది. 6gb+256gb స్టోరేజ్ ఫోన్ ధ‌ర రూ.19,999గా ఉంది. 8gb+256gb స్టోరేజ్ ఫోన్ ధ‌ర రూ.21,999 గా ఉంది.

Next Story