- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Oppo K13 Turbo: 7,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే !
ఒప్పో K13 టర్బో పేరుతో కొత్త ఫోన్ తీసుకువచ్చింది.8gb + 256 జీబీ వేరియంట్ మొబైల్ ధర 30 వేల రూపాయలు గా ఉంది

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశ వ్యాప్తంగా ఒప్పో మొబైల్ కంపెనీకి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తున్న ఒప్పో... ఇప్పుడు మరో సరికొత్త 5G మొబైల్ తో మార్కెట్లోకి వచ్చేసింది. ఒప్పో K13 టర్బో ( Oppo K13 Turbo) పేరుతో కొత్త ఫోన్ తీసుకువచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ భారతదేశవ్యాప్తంగా ఈ ఫోన్స్ లాంచ్ అయ్యాయి.
ఇక ఈ ఒప్పో టర్బో మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో ఏకంగా 7000 mah బ్యాటరీ సామర్థ్యం ఉంది. 80w ఫాస్ట్ చార్జర్ దీనికి సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాక్ కెమెరా 50 మెగా ఫిక్సల్ ఉంటుంది. సెల్ఫీల కోసం 16 MP కెమెరా అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 వర్షం ఆధారంగా పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ స్క్రీన్ 6.80 ఉంటుందని చెబుతున్నారు. ఈ ఒప్పో ఫోన్ దాదాపు 30 వేల నుంచి స్టార్ట్ అవుతుంది.
అంటే 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ 28,000గా ఫిక్స్ చేశారు. అలాగే 8gb + 256 జీబీ వేరియంట్ మొబైల్ ధర 30 వేల రూపాయలు గా ఉంది. పర్పుల్, నైట్ వైట్, మిడ్ మావేరిక్ కలర్స్ లో ఈ మొబైల్ మనకు లభిస్తుంది. ఆగస్టు 18వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. ఆన్లైన్లో మనం ఎక్కడైనా ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.






