Oppo Find X8 Pro:ఒప్పో ఫోన్ పై రూ.20 వేల డిస్కౌంట్.. వివ‌రాలు ఇవే

by velandi.Saikiran |

ఒప్పో ఫోన్ పై రూ.20 వేల డిస్కౌంట్ ప్ర‌క‌టించింది కంపెనీ. దీంతో క‌స్ట‌మ‌ర్లు కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

Oppo Find X8 Pro:ఒప్పో ఫోన్ పై రూ.20 వేల డిస్కౌంట్.. వివ‌రాలు ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్ లో ఒప్పో ఫోన్లకు ఉన్న గిరాకీ అంతా కాదు. అన్ని బ్రాండ్ ఫోన్లకు ఒప్పో కూడా పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే మిడిల్ క్లాస్ రేంజ్ నుంచి హై క్లాస్ రక రకాల ఫోన్లు రిలీజ్ చేస్తోంది ఒప్పో. అయితే, ఒప్పో నుంచి ఇప్పటికే వచ్చిన ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రో ( Oppo Find X8 Pro ) ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించారు.

ఈ ఫోన్ పై మొత్తం రూ. 20 వేలకు పైగా ఆఫర్ లభించనుంది. నేరుగా 15 వేల రూపాయల తగ్గింపు ప్రకటించింది ఒప్పో. అలాగే క్రెడిట్ కార్డులు, ఇతర డెబిట్ కార్డులు వాడితే మరో ఐదు వేలకు పైగా డిస్కౌంట్ లభించనుంది. ఇలా మొత్తంగా రూ. 20,700 ఆఫర్ లభించనుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ మేరకు ఒప్పో అధికారిక ప్రకటన చేసింది.

Oppo Find X8 Pro ఫీచ‌ర్స్‌

6.78 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ Oppo Find X8 Pro ఫోన్, 120 HZ రిఫ్రిస్ట్ రేట్ కలిగి ఉంటుంది. 5910 mah బ్యాటరీ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. 80w ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 పైన ఆధారపడి ఉంటుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా కూడా కలిగి ఉంటుంది.

Next Story