ఇండియాలోకి అడుగుపెట్టిన సంచలన ChatGPT.. డౌన్‌లోడ్ స్టాట్

by Disha Web Desk 17 |
ఇండియాలోకి అడుగుపెట్టిన సంచలన ChatGPT.. డౌన్‌లోడ్ స్టాట్
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) OpenAI యాప్ ChatGPT ఇప్పుడు భారత్‌లోకి విడుదల అయింది. ఇండియాలోని iOS వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ కొత్తగా భారత్‌తో పాటు 11 దేశాలలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి iOS వినియోగదారులకు ఈ యాప్‌ను విడుదల చేసినప్పటికి త్వరలో android యాప్‌ను కూడా లాంచ్ చేస్తామని OpenAI పేర్కొంది.

భారత్‌తో పాటు కొత్తగా అల్బేనియా, క్రొయేషియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, జమైకా, కొరియా, న్యూజిలాండ్, నికరాగ్వా, నైజీరియా, UK దేశాల్లో ఈ యాప్ లభిస్తుంది. ఇప్పటి వరకు మొత్తంగా 30కి పైగా దేశాల్లో ChatGPT యాప్ డౌన్‌లోడ్ చేసుకోడానికి అందుబాటులో ఉంది. ఇది iOS 16.1 లేదా తర్వాతి వెర్షన్‌లో నడుస్తున్న iPhoneలకు అనుకూలంగా ఉంటుంది.





Next Story

Most Viewed