- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
INSTAGRAM: మెటా కీలక ప్రకటన.. ఇకపై ఇన్‌స్టాలో అలాంటి కంటెంట్ చూడాలంటే పర్మిషన్ ఉండాల్సిందే!
ప్రస్తుతం యువత ఎక్కువగా వాడుతున్న ఇన్ స్టాగ్రామ్ టీనేజర్లకు కొత్త నిబంధన విధించింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా కీలక ప్రకటన చేసింది. గతేడాది టీనేజర్లు సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వగా, వాళ్లకు డీఫాల్ట్‌గా PG-13 కంటెంట్ మాత్రమే కనిపిస్తుందని తాజాగా ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం యువత ఎక్కువగా వాడుతున్న ఇన్ స్టాగ్రామ్ (INSTAGRAM) టీనేజర్లకు కొత్త నిబంధన విధించింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (META) కీలక ప్రకటన చేసింది. గతేడాది టీనేజర్లు సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వగా, వాళ్లకు డీఫాల్ట్‌గా PG-13 కంటెంట్ మాత్రమే కనిపిస్తుందని తాజాగా ప్రకటన చేసింది. ఈ సెట్టింగ్ సర్దుబాటు చేసుకోవాలి అంటే దానికి తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేసింది.
ఈ నిబంధన ప్రకారం టీనేజర్ల ఇన్‌స్టా అకౌంట్స్‌లో PG-13 కంటెంట్ అంటే ఎలాంటి అసభ్యకర ఫోటోలు, శృంగారభరితమైన ఫోటోలో, వీడియోలు మరియు నేరాలకు సంబంధించిన కంటెంట్ కనిపించదు. అదే విధంగా మత్తు పదార్థాలకు సంబంధించినవి, విన్యాసాలకు సంబంధించిన కంటెంట్ సైతం నిరోధించబడుతుంది. దాని ద్వారా కేవలం బిలో 18 కంటెంట్ మాత్రమే చూడగలుగుతారు. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ వల్ల మైనర్లు ప్రభావితం అవుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.






