- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
One Plus : 9000mAh బ్యాటరీతో వనప్లస్ ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే !
వన్ ప్లస్ నార్డ్ 6 ( OnePlus Nord 6 ) పేరుతో తీసుకువచ్చేందుకు వన్ ప్లస్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుగోలు చేసేలా కొన్ని వస్తుంటే, మరికొన్ని హై రేంజ్ ఫోన్స్ కూడా లాంఛ్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే వన్ ప్లస్ నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి వన్ ప్లస్ టర్బో 6 ( OnePlus Turbo 6 ) ఫోన్ త్వరలో మార్కెట్లోకి రాబోతుందట. ఈ ఫోన్ ను వన్ ప్లస్ నార్డ్ 6 ( OnePlus Nord 6 ) పేరుతో తీసుకువచ్చేందుకు వన్ ప్లస్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జులై లో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కాబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
OnePlus Nord 6 ఫీచర్స్, ధర ఎంతంటే ?
OnePlus Nord 6 మొబైల్ ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.78 అంగుళాల డిస్ ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ 50MP (Main) + 2MP (Monochrome) కెమెరాతో రానుంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. 9000mAh బ్యాటరీతో ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. దీనికి 80W వైర్డ్ అలాగే, 27W రివర్స్ వైర్డ్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. ఈ ధర రూ.34వేలకు పైగా ఉండే ఛాన్స్ ఉందట.






