OnePlus నుంచి ‘Nord Buds 2’ ఇయర్‌ఫోన్‌లు

by Disha Web Desk 17 |
OnePlus నుంచి ‘Nord Buds 2’ ఇయర్‌ఫోన్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: OnePlus కంపెనీ నుంచి కొత్తగా ఇయర్‌ఫోన్‌లు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. వీటి పేరు ‘Nord Buds 2’. దీని ధర రూ. 2,999. ఇవి తెలుపు, బూడిద రంగు కలర్స్‌లలో లభిస్తాయి. OnePlus Nord Buds 2 ఏప్రిల్ 11న అమ్మకానికి వస్తుంది. OnePlus ఆన్‌లైన్ స్టోర్, Amazon, Flipkart, Myntra, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, ఇతర స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇయర్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తున్నాయి. మ్యూజిక్, కాల్స్‌ను టచ్ కంట్రోల్ ద్వారా ఆపరేటింగ్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం SBC, AAC బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్‌తో బ్లూటూత్ 5.3ని అందించారు. చార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP55 రేటింగ్ చేయబడింది. ప్రత్యేకంగా ఈక్వలైజర్ సెట్టింగ్‌లు, తక్కువ-లేటెన్సీ గేమ్ మోడ్‌తో సహా, HeyMelody యాప్ కనెక్టివిటీ కూడా అందించారు.





Next Story

Most Viewed