- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్ ప్లస్ నుంచి మరో ఫోన్ వచ్చేస్తోంది..ధర, ఫీచర్స్ ఇవే
వన్ ప్లస్ 15 ( OnePlus 15) పేరుతో చైనాలో కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది కంపెనీ.

దిశ, వెబ్ డెస్క్: మన భారత మార్కెట్లో రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇందులో సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా ఫోన్స్ రావడం గమనార్హం. ముఖ్యంగా వన్ ప్లస్ నుంచి అదిరిపోయే ఫోన్లు ఈ మధ్య వస్తున్నాయి. మార్కెట్ లో ఈ కంపెనీకి మంచి పేరు ఉన్న నేపథ్యంలో జనాలు కూడా కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వన్ ప్లస్ ( OnePlus ) కంపెనీ నుంచి మరో సరికొత్త మొబైల్ ఫోన్ ఇండియాలో త్వరలో లాంచ్ కానుంది. వన్ ప్లస్ 15 ( OnePlus 15) పేరుతో చైనాలో కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది కంపెనీ.
మన ఇండియాలో నవంబర్ రెండవ వారంలో ఈ మొబైల్ ఫోన్ తీసుకువచ్చే ప్లాన్ చేస్తోంది. గత సంవత్సరం వన్ ప్లస్ 13 తీసుకువచ్చిన కంపెనీ, నేరుగా వన్ ప్లస్ 15 కు వచ్చేసింది. వనప్లస్ 14 మోడల్ ను హోల్డ్ లో పెట్టింది. 6.78 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ ఫోన్ ధర 70 వేల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా అందిస్తున్నారు. 7300 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. 120w వైల్డ్ చార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 8.31 ఎంఎం మందంతో ఉన్న ఈ మొబైల్ 215 గ్రాములు ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. వన్ ప్లస్ 13S ఫోన్ ను ఇది పోలి ఉంటుంది.






