- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.20 వేలకే నథింగ్ స్మార్ట్ ఫోన్..అదిరిపోయే ఫీచర్స్ ఇవే
నథింగ్ ఫోన్ కంపెనీ కూడా కొత్త మోడల్ ఫోన్ తీసుకువచ్చింది. నథింగ్ ఫోన్ 3ఏ లైట్ ను (

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ మార్కెట్ లోకి రకరకాల ఫోన్లు వస్తున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా విపరీతంగా ఫోన్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయా కంపెనీలు, కొత్త ఫీచర్స్ తో రక రకాల మోడల్ మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇందులో సామాన్యులను దృష్టిలో పెట్టుకొని చాలా ఫోన్స్ వస్తున్నాయి. రూ. 20 వేల బడ్జెట్ వరకు సామాన్యులు మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే రకరకాల ఫోన్స్ మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి.
అయితే తాజాగా నథింగ్ ఫోన్ కంపెనీ కూడా కొత్త మోడల్ ఫోన్ తీసుకువచ్చింది. నథింగ్ ఫోన్ 3ఏ లైట్ ను ( Nothing Phone 3a Lite ) భారత మార్కెట్ లో తాజాగా లాంచ్ చేసింది కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయిన ఈ నథింగ్ ఫోన్ ( Nothing Phone 3a Lite) ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 6.77 అంగుళాల AMOLED డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50MP (Main) + 8MP (UW) + 2MP (Macro) Rear Camera కూడా ఈ ఫోన్ కు అందిస్తున్నారు. ఇక సెల్ఫీల కోసం 16MP కెమెరా కూడా అందిస్తోంది కంపెనీ.
ముఖ్యంగా 5000mAh బ్యాటరీని Nothing Phone 3a Lite కు అందిస్తున్నారు. ఈ ఫోన్ కు 33W వైర్డ్ ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేయనుంది. Android 15, Nothing OS 3.5 ఆధారంగా ఈ ఫోన్ వర్క్ చేయనుంది. 8GB + 128GB వేరియంట్ ఫోన్ ధర రూ. 20,999 గా ఫిక్స్ చేశారు. 8GB + 256GB వేరియంట్ ఫోన్ ధర Rs. 22,999 గా ఫైనల్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ ధరలు సామాన్యులు కూడా కొనుగోలు చేసే విధంగా ఉన్నాయి. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డులు వాడితే, ధర మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది.






