నథింగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్..5000 బ్యాట‌రీ..ధ‌ర ఎంతంటే ?

by velandi.Saikiran |

నథింగ్ ఫోన్ 3a లైట్ ( ( Nothing Phone 3a Lite )) మోడల్ ఫోన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. రేపు ఈ మొబైల్ ఫోన్ లాంచ్ కాబోతుంది

నథింగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్..5000 బ్యాట‌రీ..ధ‌ర ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. మంచి ఫీచర్స్, సామాన్యులకు అందుబాటులో ఉండేలా మొబైల్స్ వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో నథింగ్ కంపెనీ నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది. ఈ కంపెనీ నుంచి నథింగ్ ఫోన్ 3a లైట్ ( ( Nothing Phone 3a Lite )) మోడల్ ఫోన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. రేపు ఈ మొబైల్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అయితే ఒక్కరోజు ముందుగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇక ఈ మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే... 6.7 ఇంచుల డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ 7300 soc డైమన్ సిటీ కలిగి ఉంటుందట. 50 ఎంపీ ప్రధాన కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఉంటుందట. 33w వైడ్ చార్జర్ సపోర్ట్ చేసే ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 5000mah ఉంటుంది. నథింగ్ ఫోన్ 3a కంటే నథింగ్ ఫోన్ 3a లైట్ ధ‌ర త‌క్కువగానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రేపు లాంచ్ అయ్యే నథింగ్ ఫోన్ 3a లైట్ ఫోన్ ధ‌ర రూ.23 వేల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం.

Next Story