ఫొటోగ్రాఫర్ అవసరం లేదీక.. ఏఐ కెమెరామెన్ యాప్ వచ్చేసింది! సోషల్ మీడియాలో ట్రెండింగ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-30 02:55:54  IST  )

మనలో చాలా మందికి ఫొటోలు దిగటం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఆ సరైన ఫ్రేమింగ్, లైటింగ్, పోజింగ్ కోసం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ను తీసుకోవాలంటే

ఫొటోగ్రాఫర్ అవసరం లేదీక.. ఏఐ కెమెరామెన్ యాప్ వచ్చేసింది! సోషల్ మీడియాలో ట్రెండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మందికి ఫొటోలు దిగటం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఆ సరైన ఫ్రేమింగ్, లైటింగ్, పోజింగ్ కోసం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ను తీసుకోవాలంటే ఖర్చు కూడా చాలా అవుతుంది. అయితే, ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. AI Cameraman అనే అద్భుతమైన యాప్ వచ్చేసింది. ఈ యాప్ ద్వారా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ లాంటి సూచనలతో ఎప్పుడైనా, ఎలాగైనా ఫొటోలు తీసుకోవచ్చు. ప్రసుత్తం ఈ యాప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ యాప్ ఫేస్ రికగ్నిషన్, బాడీ మోవ్‌మెంట్ అనలిసిస్, లైట్ డిటెక్షన్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. కెమెరా ఫీడ్‌ని రియల్ టైమ్‌లో అర్థం చేసుకుంటుంది. ఫలితంగా కెమెరా ముందు ఉన్న వ్యక్తులు లేదా ఆబ్జెక్టులను గుర్తించి, వాటిని క్రమంగా ఫ్రేమ్‌లో సరైన స్థానంలో ఉండేలా ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. అలాగే, ఫోటోలో సబ్జెక్ట్ ఎలా ఉండాలి, ఏ యాంగిల్‌లో ఉండాలి, ఫ్రేమ్ మధ్యలో ఎలా ఉండాలి వంటి సూచనలు ఇస్తుంది. పరిసరాల లైటింగ్ ఎంత సరిపోతుంది, ఏ ప్రాంతాల్లో వెలుతురు పెంచాలి లేదా తగ్గించాలి అనే విషయాల్లో కూగా సలహాలు అందిస్తుంది.

ప్రస్తుతం ఈ యాప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండవుతోంది. ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు దీన్ని వినియోగించి తమ ఫోటోలు, వీడియోలు మరింత ప్రొఫెషనల్ లుక్‌తో షేర్ చేస్తున్నారు. ఇక ఈ యాప్ ఫోటోగ్రఫీలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుందనే అభిప్రాయం టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story