- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 15 నుంచి యూట్యూబ్‌లో కొత్త రూల్స్.. ఏంటంటే?

దిశ, వెబ్ డెస్క్: గూగుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా అవతరించింది. నిత్యం లక్షలాది వీడియోలతో యూజర్లను అలరిస్తూ బిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. 2005లో ప్రారంభమైనప్పటి నుంచి యూట్యూబ్.. విద్య, వినోదం, వార్తలు, సాంకేతికత, గేమింగ్ వంటి అనేక విభాగాల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. కేవలం వీడియోలు అప్‌లోడ్ చేసే ప్లాట్‌ఫారమ్ లాగా మాత్రమే కాకుండా.. వృత్తిపరమైన ఆదాయ మార్గంగా, సామాజిక మార్పు సాధనంగా, గ్లోబల్ కమ్యూనికేషన్ ఛానెల్‌గా మారింది. ఈ నేపథ్యంలో జులై 15 నుంచి యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలసీలో పెద్ద మార్పులు చేస్తున్నది. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది క్రియేటర్లపై ప్రభావం చూపనున్నాయి.
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP)లో భాగంగా నిజమైన కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రిపీటెడ్ కంటెంట్, AI కంటెంట్, ఉపయోగకరం కానీ కంటెంట్లను గుర్తించి వాటి రీచ్‌ను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. జులై 15 తర్వాత నిజమైన, ఒరిజినల్ కంటెంట్‌కి మాత్రమే మనీ వస్తుంది. దీంతో ఇకపై క్రియేటర్లు కచ్చితంగా ఇతరుల కంటెంట్‌ను తీసుకుంటే పెద్ద మార్పులు లేకుండా ఉపయోగించకూడదు. తీసుకున్నా, అది కొత్తగా కనిపించేలా, మీ సొంతగా క్రియేటివిటీ ఉపయోగించి మార్పులు చేయడం అవసరం.
అదే విధమైన టెంప్లేట్‌లలో తయారు చేసినా, పదేపదే పునరావృతం చేసిన, కేవలం వ్యూస్ పొందాలనే ఉద్దేశ్యంతో తయారు చేసే వీడియోలకు రీచ్ ఉండదు. అలాంటి వీడియోలను అనుమానాస్పదంగా చూడబోతోంది. ఇందులో కష్టపడకుండా క్రియేట్ చేసే కంటెంట్, క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్, ఎటువంటి ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్మెంట్ లేకుండా తయారు చేసిన వీడియోలు ఉన్నాయి. ఇక అలాగే ప్రస్తుత ట్రెండ్‌లను పరిశీలిస్తే, మానవ సహకారం లేకుండా వాయిస్ లేదా రియాక్షన్స్‌ను జోడించిన AI రూపొందించిన వీడియోలు కూడా ఈ కొత్త నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.






