Whatsapp update: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..ఇకపై ఆ కష్టాలు ఉండవు

by Ajay Maddhiboyina |

వినియోగ‌దారుల కోసం వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అప్డేట్స్ తీసుకువ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు మ‌రో కొత్త ఫీచ‌ర్ తీసుకువ‌చ్చేందుకు వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్ర‌య‌త్నిస్తోంది.

Whatsapp update: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..ఇకపై ఆ కష్టాలు ఉండవు
X

దిశ, వెబ్ డెస్క్: వినియోగ‌దారుల కోసం వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అప్డేట్స్ తీసుకువ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు మ‌రో కొత్త ఫీచ‌ర్ తీసుకువ‌చ్చేందుకు వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం వాట్సాప్‌లో టెక్స్ట్ రూపంలో ఉన్న కంటెంట్ కాపీ చేయాలని ప్రయత్నిస్తే పూర్తి కంటెంట్ కాపీ అవుతుంది. అందులో అవసరమైన కంటెంట్ మాత్రమే సెలక్ట్ చేసుకుని కాపీ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఇది వినియోగదారుడికి అసౌకర్యంగా ఉంటుంది.

అయితే ఇప్పుడు ఆ బాధలు లేకుండా చేసేందుకు కేవలం సెలెక్టెడ్ పదాలనే కాపీ చేసుకునే ఆప్షన్‌ను మెటా తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆప్షన్ పర్సనల్ చాట్స్, గ్రూప్ చాట్స్, ఛానల్స్‌లోనూ పనిచేస్తుందట. వాట్సాప్ తీసుకురాబోతున్న అప్డేట్ వర్షన్ ఆండ్రాయిడ్ 2.25.18.3లో ఈ ఆప్షన్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ ఆప్షన్‌తో యూజర్లు కేవలం తాము షేర్ చేయాలి అనుకునే కంటెంట్‌ని మాత్రమే పంపే అవకాశం ఉంటుంది. ఇప్ప‌టికే ఈ ఆప్ష‌న్ ఐఓఎస్ లో టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ఆప్ష‌న్ వ‌చ్చిన త‌ర‌వాత కంటెంట్ షేరింగ్ ఎక్కువ‌గా చేసే వారి క‌ష్టాలు తీర‌నున్నాయి. ఇక దీనితో పాటు వాట్సాప్ ఇప్ప‌టికే మ‌రికొన్ని ముఖ్య‌మైన అప్డేట్లు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Next Story