- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌స్టాలో ప్రాణాలు కాపాడే ఫీచర్.. సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే వారికి అలర్ట్
ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్‌ల ప్రాణాలు కాపాడేందుకు సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. టీనేజర్‌లు ఎవరైనా ఆత్మహత్య గురించి లేదా స్వీయహాని లాంటి పదాలను పదే పదే వెతికితే వెంటనే తల్లిదండ్రులకు అలర్ట్ మెసేజ్ వెళుతుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్‌ల ప్రాణాలు కాపాడేందుకు సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. టీనేజర్‌లు ఎవరైనా ఆత్మహత్య గురించి లేదా స్వీయహాని లాంటి పదాలను పదే పదే వెతికితే వెంటనే తల్లిదండ్రులకు అలర్ట్ మెసేజ్ వెళుతుంది. ఇన్‌స్టా మాతృ సంస్థ మెటా ప్రకారం.. ఇన్ స్టాలో ఎవరైనా సూసైడ్ సంబంధిత సమాచారం వెతికినట్టయితే వెంటనే సంబంధిత సమాచారం రాకుండా బ్లాక్ చేస్తుందని తెలిపింది. అంతే కాకుండా సెర్చ్ చేసినవారికి తక్షణసాయం కోసం హెల్ప్ లైన్‌కు మళ్లిస్తుందని పేర్కొంది.
అయినప్పటికీ పదేపదే సెర్చ్ చేస్తే వినియోగదారుడికి మరింత సహాయం అవసరం అని నేరుగా తల్లిదండ్రులకు సమాచారం అందిస్తుందని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు లింక్ చేసిన ఈమెయిల్, కాంటాక్ట్ వివరాలు బట్టి ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా వార్నింగ్ మెసేజ్ పంపబడతాయని మెటా పేర్కొంది. అంతే కాకుండా తల్లి దండ్రులకు యాప్ లో సైతం నోటిఫికేషన్ వెళుతుందని తెలిపింది. ఈ ఫీచర్ వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి, వారిని హాని చేసుకోకుండా కాపాడటానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇక ఈ ఫీచర్ మొదట యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది.






