Meta AI:మెటా నుంచి కొత్త ఏఐ యాప్.. పూర్తిగా ఉచితం

by Yella Dhawani Reddy |

రోజు రోజుకూ అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రాధాన్యత పెరుగుతోంది.

Meta AI:మెటా నుంచి కొత్త ఏఐ యాప్.. పూర్తిగా ఉచితం
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకూ అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రాధాన్యత పెరుగుతోంది. వ్యాపారం, వైద్యం, విద్య, వినోదం సహా అనేక రంగాల్లో ఏఐ పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఎవరి నోటా విన్న ఏఐ మాటే వినిపిస్తోంది. ఇక వినియోగదారుల మన్నన పొందేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి టెక్ దిగ్గజాలు ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. తాజాగా మెటా కూడా ఎక్కడా తగ్గకుండా.. తన సేవల్ని మరింత మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మెటా ఏఐ యాప్‌ను లాంచ్‌ చేసింది.

చాట్‌బాట్ రంగంలో చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి మెటా ఏఐ యాప్‌ను (Meta AI app) తీసుకొచ్చింది. యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. ఇక లామా 4 లాంగ్వేజ్‌ మోడల్‌తో రూపొందించిన ఈ యాప్.. కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా చాట్, రచనలు, హ్యూమర్, సహాయక సమాచారం ఇలా అనేక రంగాల గురించి అద్భుతంగా సమాచారం అందిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రతిరోజూ చాలామంది మెటా ఏఐని వినియోగిస్తున్నారు. ఈ యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అప్లికేషన్‌ను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే ఈ యాప్‌లో డిస్కవర్ ఫీడ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఇక్కడ యూజర్లు తమ ఏఐ ప్రాంప్ట్‌లు, చిత్రాలు, చాట్‌బాట్ రిప్లైలను షేర్ చేయొచ్చు. ఇతరులు వాటిని లైక్ చేయొచ్చు, కామెంట్ లేదా రీమిక్స్ చేయొచ్చు.అయితే ఈ యాప్ ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది.

Next Story