NFBC SCHEME: కుటుంబ పెద్ద చనిపోతే ఉచితంగా రూ.20వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం.. ఇలా అప్లై చేయండి

by Ajay Maddhiboyina |

పేద‌ కుటుంబాల్లో కుటుంబ పెద్ద మ‌ర‌ణిస్తే మాన‌సికంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందిప‌డ‌తారు. అలాంటి స‌మ‌యంలో డ‌బ్బులు లేక ఇత‌రుల ద‌గ్గ‌ర అప్పులు చేస్తారు. అయితే అలాంటి వారికి చిరుసాయంగా రూ.20వేలు అందించేందుకు ఓ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం అందుబాటులో ఉంది.

NFBC SCHEME: కుటుంబ పెద్ద చనిపోతే ఉచితంగా రూ.20వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం.. ఇలా అప్లై చేయండి
X

దిశ‌, వెబ్ డెస్క్: పేద‌ కుటుంబాల్లో కుటుంబ పెద్ద మ‌ర‌ణిస్తే మాన‌సికంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందిప‌డ‌తారు. అలాంటి స‌మ‌యంలో డ‌బ్బులు లేక ఇత‌రుల ద‌గ్గ‌ర అప్పులు చేస్తారు. అయితే అలాంటి వారికి చిరుసాయంగా రూ.20వేలు అందించేందుకు ఓ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం అందుబాటులో ఉంది. చాలా మందికి ఈ స్కీమ్ గురించి తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల దీనికి సంబంధించిన నిధులు అలాగే ఉండిపోతున్నాయి. ఈ ప‌థ‌కం పేరు జాతీయ కుటుంబ ప్ర‌యోజ‌న ప‌థ‌కం (ఎన్‌ఎఫ్‌బీఎస్‌) కాగా 2017లో కేంద్రం దీనిని అమ‌లులోకి తీసుకువ‌చ్చింది.

రోడ్డు ప్ర‌మాదంలో కానీ ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కానీ కుటుంబ పెద్ద మ‌ర‌ణిస్తే కుటుంబానికి అండ‌గా ఉండేందుకు ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌థ‌కం కింద‌ గ‌రిష్ఠంగా సంవ‌త్స‌రానికి 7,794 మందికి రూ.20వేలు సాయం చేస్తారు. కానీ ఎవ్వ‌రికీ తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల అర్హులైన‌ప్ప‌టికీ దీని ఫ‌లాలు పొంద‌లేక‌పోతున్నారు. దీంతో ద‌ర‌ఖాస్తులు లేక సెర్ప్ వ‌ద్ద రూ.60 కోట్ల నిధులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప‌ట్ట‌ణాలు, గ్రామాల‌లో ఉండే రైతులు, కూలీలు చిన్న చిన్న ప‌నులు చేసే కార్మికులు, దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వాళ్లు మాత్ర‌మే ప‌థ‌కానికి అర్హులు. ప‌థ‌కానికి అప్లై చేయాలంటే చ‌నిపోయిన నాటికి వారి వ‌య‌సు 18 నుండి 60 ఏళ్ల లోపు ఉండాలి.

ఇలా అప్లై చేసుకోండి

కుటుంబ పెద్ద మ‌ర‌ణిస్తే ఆ వ్య‌క్తి కుటుంబ స‌భ్యులు రెండేళ్ల లోపు ఎప్పుడైనా ఈ ప‌థ‌కానికి అప్లై చేసుకోవ‌చ్చు. దీనికి అప్లై చేయాలంటే క‌చ్చితంగా మ‌ర‌ణ‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు ఉండాలి. అంతేకాకుండా కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్, రేష‌న్ కార్డ్, ఆధార్ కార్డు లాంటి వివ‌రాల‌తో కూడిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను త‌హ‌సీల్దార్ కు అంద‌జేయాలి. ఐకేపీ, రెవెన్యూ అధికారులు ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించి ఆర్డీవోకు పంపిస్తారు. త‌ర‌వాత సెర్ప్ సీఈవోకు వెళుతుంది. అమోదం వ‌స్తే లబ్ధిదారుల అకౌంట్ లో రూ.20వేలు నేరుగా జ‌మ అవుతాయి.

Next Story